'బిజినెస్ మ్యాన్' లైవ్ అప్ డేట్స్ (దుబాయ్)
బిజినెస్ మ్యాన్ చిత్రం ఈ రోజు ఇండియాలో విడుదల అవుతోంది. ఈ చిత్రం దుబాయి లో షో పడిందని,లైవ్ అప్ డేట్స్ ..రివ్యూ అంటూ నెట్ లో ప్రత్యక్ష్యమయ్యాయి. వారు ఇచ్చిన అప్ డేట్స్ ప్రకారం సినిమా సూపర్ హిట్ అని ఉంది. వారు చెప్పే అప్ డేట్స్ చూస్తే...టైటిల్స్ పూరీ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ప్రారంభమవుతుంది.మొదట్లోనే ఉచ్చ డైలాగు. మహేష్ బాబు దాన్ని బ్రహ్మాజీ తో అంటాడు. ఆ తర్వాత కాజల్ ఎంట్రన్స్. ఆమె ముంబై పోలీస్ కమీషనర్(నాజర్ కూతురు). మహేష్ ఆమె కోసం ట్రై చేస్తూంటాడు. మరో ప్రక్క మహేష్ ముంబై వచ్చి డాన్ గా ఎదటనాకి చేసే ప్రయత్నం. అక్కడ పేద ప్రజలకు సాయిం చేస్తూ.. సూర్య బాయ్ గా ఎదగటం. లోకల్ గా షాయేజి షిండే అనే పొలిటీషయన్ కిసాయిం చేయటం. ఫస్ట్ ఫైట్..అక్కడే రౌండప్ చేసి నన్ను కొట్టద్దు లాంటి హైలెట్ డైలాగ్స్ అన్ని వస్తాయి. ముంబైలోనే పెద్ద డాన్ అవ్వటానికి ప్రయత్నం. ముంబై సాంగ్.
ఈ లోగా కాజల్.. మహేష్ తో ప్రేమలో పడుతుంది. కాని మహేష్ రివర్స్ అవుతాడు. నాకు టైమ్ కావాలి అంటాడు. కాజల్ బాద పాట. ఈలోగా ప్రకాష్ రాజ్ ఎంట్రన్స్..మహేష్ ఆపోజిట్ పర్శన్ కి సోపోర్ట్ గా వస్తాడు. ఈలోగా నాజర్ తో మహేష్..ముంబైని మాఫియాతో కళకళ్లాడించి..పూర్వ వైభవం తెస్తాను అంటాడు. ఆ తర్వాత సార్..వస్తారా..సాంగ్ ..కాజల్ ఈ పాట అదిరిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత పోలీసులతో గన్ ఫైట్..ఇలా ముంబైలో మహేష్ డాన్ అవ్వటానికి చేసే ప్రయత్నాలు..అతను ఎలా ఎందుకు అవ్వాలనుకున్నాడు అనే ప్లాష్ బ్యాక్ తో కథనం నడుస్తుంది. ఫైనల్ గా క్లైమాక్స్ ముందు పోకిరి తరహాలో ఓ ట్విస్ట్ ఉంటుంది. ఇవన్నీ వారు లైవ్ అప్ డేట్స్ అందించినవి. ఇక ఇవన్నీ ప్రక్కన పెడితే మరి కాస్సేపటిలోనే ధట్స్ తెలుగులో ఈ చిత్రం పూర్తి రివ్యూ విశ్లేషాత్మకంగా వస్తుంది.


Click it and Unblock the Notifications











