శంషాబాద్ నుంచి ‘బిజినెస్ మ్యాన్’ షురూ

By Bojja Kumar

మహేష్‌ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం 'బిజినెస్ మేన్" షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆరంభమైంది. మహేష్ బాబు సరనన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ.. 'ప్రేక్షకులు, అభిమానులు కావాలని కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయన్నారు. పోకిరి తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది అన్నారు. దర్శకుడు పూరి మాట్లాడుతూ ఈ చిత్రంలో మహేష్‌బాబు కేరక్టరైజేషన్, ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయన్నారు.

మహేష్, పూరి కాంబినేషన్‌లో ఇంత భారీ చిత్రం నిర్మించడం ఆనందంగా ఉందని, ఆలస్యం చేయకుండా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాత వెంకట్ తెలిపారు. ఈ నెల 10 వరకు హైదరాబాద్‌లో షూటింగ్ చేసి, 11 నుంచి డిసెంబర్ 25 వరకు ముంబై, హైదరాబాద్, విదేశాల్లో షూటింగ్ చేస్తామన్నారు. ఈ సినిమాలో ఇంకా..... ప్రకాష్‌రాజ్, సాయాజీ ఇండే, ధర్మవరపు, బ్రహ్మాజీ, రాజా మురద్, జహంగీర్‌ఖాన్ తదితరులు నటిస్తున్నారు.

సంగీతం: థమన్ ఎస్., సినిమాటోగ్రఫి: శ్యామ్ కె.నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, లైన్ ప్రొడ్యూసర్: నీరజ్ శర్మ, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్ ‌రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X