ముంబైలో మహేష్-పూరి బిజినెస్ మ్యాన్
సూపర్ స్టార్ మహేష్-ఢాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న చిత్రం 'బిజినెస్ మేన్". సెప్టెంబర్ 18 నుంచి ఈ సినిమా షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ..మళ్లీ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్‌గా ఉందని, పోకిరి తర్వాత మేమిద్దరం కలిసి చేస్తున్న మరో ట్రెమండస్ స్ర్కిప్టు ఇది, మా కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్ రేంజ్ సినిమా కాబోతోందన్నారు. ప్రేక్షుకులు ఆశించే ఆల్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయన్నారు.
నిర్మాత వెంకట్ మాట్లాడుతూ..మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది, హయ్యస్ట్ టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం రూపొందుతుందన్నారు. బిజినెస్‌మేన్ మా బ్యానర్‌కి ఓ ప్రేస్టీజియస్ మూవీ అవుతుందన్నారు. సెప్టెంబర్ 18 నుంచి నాన్‌స్టాప్‌గా డిసెంబర్ 5 వరకు జరిగే షెడ్యూల్‌లో చిత్రం పూర్తవుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్, కాజల్‌లతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొన్న సీన్స్ ముంబై లో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. నాన్‌స్టాప్‌గా ముంబై, హైదరాబాద్, విదేశాల్లో షూటింగ్ జరిపి జనవరి 12న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
మహేష్‌బాబు, కాజల్, ప్రకాష్ రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్ : విజయ్, ఆర్ట్ : చిన్నా, ఎడిటింగ్ : ఎస్.ఆర్. శేఖర్, డాన్స్ : దినేష్, కో డైరెక్టర్ : విజయ ప్రసాద్.


Click it and Unblock the Notifications











