'బిజినెస్ మ్యాన్ 2' గురించి పూరీ క్లారిఫికేషన్

By Srikanya

హైదరాబాద్: బిజినెస్ మ్యాన్ హిట్టవగానే వెంటనే పూరీ జగన్నాధ్ తను మహేష్ తో బిజినెస్ మ్యాన్ 2 చిత్రం చేస్తున్నానని ప్రకటించారు. అంతేగాక తాను ఓ లైన్ కూడా రెడీ చేసానని ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి ఆ సినిమాని విడుదల చేస్తాను అన్నారు. అయితే ఆయన వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ ఆ విషయమే ఎత్తటం లేదు. దాంతో రకరకాల అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేఫద్యంలో ఆయన మీడియాతో ఈ విషయమై క్లారిఫై చేసారు. ఆయన మాట్లాడుతూ.. బిజినెస్ మ్యాన్ 2 సినిమా ఇక లేనట్టే. ఆ స్థానంలో మహేష్‌ కోసం కొత్త కథ రాస్తా అన్నారు.

ఇక అప్పట్లో ...రామ్ గోపాల్ వర్మ.."హ..హ..హ..ఇప్పుడే పూరీ తన బిజినెస్ మ్యాన్ 2 స్టోరీ నేరేట్ చేసారు. బిజినెస్ మ్యాన్ 2 ముందు బిజినెస్ మ్యాన్ ప్లాప్ క్రింద లెక్క. బిజినెస్ మ్యాన్ 2 లోని మహేష్ క్యారక్టరైజేషన్ వింటూంటే నమ్మలేకపోయాను. బిజినెస్ మ్యాన్ లో టెర్రఫిక్ గా చేసిన దాని కన్నా చాలా చాలా బాగుంది" అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. ఈ వార్త మహేష్ అభిమానులను చాలా ఆనందపరించి. అయితే ఇప్పుడు పూరీ బిజినెస్ మ్యాన్ 2 లేదనటంతో వర్మ చెప్పింది అబద్దమే అంటున్నారు.

ఇక ప్రస్తుతం పూరీ జగన్నాధ్...దేముడు చేసిన మనుష్యులు ప్రమోషన్ లోనూ,పవన్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ లోనూ బిజీగా ఉన్నారు. 'బిజినెస్‌మేన్‌' సినిమాని డెబ్బైరోజుల్లో ముగించారు. 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమా కొబ్బరికాయ కొట్టిన రోజే విడుదల తేదీ ప్రకటించారు. ఇప్పుడు 'దేవుడు చేసిన మనుషులు' సినిమాతో వినోదం పంచడానికి సిద్ధమయ్యారు. ఆ చిత్రం ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X