‘బిజినెస్ మేన్’...350 సెంటర్లు 50 రోజులు

By Bojja Kumar

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'బిజినెస్ మేన్' చిత్రం మరో రికార్డు నమోదు చేసింది. భారీ సక్సెస్ సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం రేపటితో(మార్చి 2) 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తమ చిత్రం 350 సెంటర్లలో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకోబోతోందని ఆ చిత్ర కో ప్రొడ్యూసర్ వి. సురేష్ రెడ్డి తెలిపారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్‌కు మహేష్ బాబు, ఆయన అభిమానులు భారీ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. త్వరలో మా సంస్థ నుంచి బిజినెస్ మేన్ 2 చిత్రం రాబోతోందని తెలిపారు.

మహేష్ బాబు, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బిజినెస్ మేన్' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో అత్యధికంగా 2 వేలకు పైగా థియేటర్లలో విడుదల చేసిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. మహేష్ బాబు కెరీర్లోనే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో హైయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X