నేడే ‘బిజినెస్ మ్యాన్’ ఆడియో గ్రాండ్ రిలీజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే సినిమా 'బిజినెస్ మ్యాన్' ఆడియో రిలీజ్ ఈ రోజు(డిసెంబర్ 22) సాయంత్రం గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ భారీ ఈవెంట్ కు శిల్పకళా వేదిక వేదికైంది. ఈ వేడుకు మహేష్ బాబుతో పాటు ఎంటైర్ యూనిట్ సభ్యలు హాజరు కానున్నారు. అంతేకాకుండా పలువురు టాలీవుడ్ బిగ్ షాట్స్ కు కూడా ఆహ్వానం పంపించారు. మహేష్ బాబు సినీ కెరీర్ లోనే ఇదో భారీ బిగ్గెస్ట్ ఆడియో ఈవెంట్ గా నిలిచే విధంగా జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు వేల సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్నందున వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుక జరిగే సందర్భంగా ట్రాఫిక్ జామ్స్ లాంటివి ఏర్పడకుండా అటు పోలీసులు కూడా ముందస్తు ఏర్పాట్లతో సిద్ధం అయ్యారు.
మహేష్ బాబు, కాజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ కలగలిపిన రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై డా.వెంకట్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దూకుడు సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా కథను పోరికిని మించిన రేంజ్ లో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ దెబ్బకు గతంలో వచ్చిన సినిమా బిజినెస్ రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











