'బిజినెస్ మేన్' ఆడియో వేడుక విశేషాలు
మహేష్ బాబు తాజా చిత్రం 'బిజినెస్ మేన్' ఆడియో వేడుక గురువారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మూడు భాషల్లో ఆడియోను విడుదల చేశారు. తమిళ వెర్షన్ ఆడియోను కృష్ణ, విజయనిర్మల ఆవిష్కరించారు. మలయాళం ఆడియోను డి.రామానాయుడు, రాజమౌళి విడుదల చేయగా, తెలుగు వెర్షన్ పాటలను మహేష్, శ్రీను వైట్ల ఆవిష్కరించారు. మెమొరీ కార్డ్‌ని మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ వేడుకలో దర్శకుడు పూరి పాత్రికేయుడి అవతారమెత్తి మహేష్, కాజల్, నమ్రత, ఛార్మిలపై ప్రశ్నలను సంధించి సభికుల్ని అలరించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ -''జగన్ ఎప్పుడు సినిమా మొదలుపెట్టారో, ఎప్పుడు పూర్తి చేశారో నాకే తెలియలేదు. జగన్ పెన్ పవరేంటో రేపు తెరమీద చూస్తారు. థమన్ అద్భుతంగా సంగీతం అందించాడు. జనవరి 11న మనందరికీ పెద్ద పండుగ మొదలు కాబోతుంది'' అన్నారు. ''దర్శకుడికి అనుక్షణం కిక్కిచ్చే హీరో మహేష్. మనం ఒకటనుకుంటే ఆయన పదింతలు చేసి చూపిస్తాడు. తమన్ మంచి సంగీతం అందించారని అన్నారు పూరి జగన్నాథ్.
ఈ కార్యక్రమంలో కృష్ణ, విజయనిర్మల, రామానాయుడు, రాజమౌళి, అచ్చిరెడ్డి, దిల్‌రాజు, వి.సురేష్‌రెడ్డి, సుధీర్‌బాబు, ఛార్మి, నిషా అగర్వాల్‌తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి.మహేష్‌బాబు హీరోగా నటించిన చిత్రమిది. కాజల్ హీరోయిన్. పూరి జగన్నాథ్ దర్శకుడు. వెంకట్ నిర్మాత. తమన్ స్వరాలు సమకూర్చారు. తెలుగు, తమిళం, మలయాళంలో ఈ చిత్రం ఒకేసారి విడుదలవుతుంది. ఈ చిత్రంలో ఆరు పాటలని భాస్కరభట్ల రవికుమార్ రాసారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం.. కొనుగోళ్ళు.. అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











