మహేష్ బాబు 100 రోజుల బిజినెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై డా. వెంకట్ నిర్మించిన 'బిజినెస్ మేన్' చిత్రం ఈ నెల 21కి దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ...పోకిరి తర్వాత జగన్ గారి కాంబినేషన్లో వచ్చిన 'బిజినెస్ మేన్' ఇంత పెద్ద హిట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. 'బిజినెస్ మేన్'లో నేను చేసిన సూర్య క్యారెక్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్లినా నన్ను సూర్య భాయ్ అని పిలుస్తున్నారు. ఈ సినిమాలో డైలాగులు నాకు చెబుతున్నారు' అన్నారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...'మహేష్ పెర్ఫార్మెన్స్ వలన సూర్య భాయ్ క్యారెక్టర్ అంత బాగా క్లిక్ అయింది. డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. మేకింగ్ పరంగా 'బిజినెస్ మేన్' తెలుగు ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్టర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ కమర్షియల్ ఫిలింని సెన్సేషనల్ హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్స్' అన్నారు.
కో ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ..రిలీజ్ సెంటర్స్ పరంగా, ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ షేర్ పరంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన బిజినెస్ మేన్ సంచలన విజయం మా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ బేనర్ వాల్యూని మరింత పెంచింది. అన్ని ముఖ్య కేంద్రాల్లోనూ బిజినెస్ మేన్ 100 రోజులుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మహేష్ బాబు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తుకన్నాను అన్నారు.
సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ.... బిజినెస్ మేన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆడియో కూడా అంత పెద్ద హిట్ అయింది. ఇందులో 'సారొస్తారా' పాట ఆల్ టైమ్ హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు. మహేష్ బాబు సరసన కాజల్ నటించిన బిజినెస్ మేన్ చిత్రానికి థమన్, శ్యామ్ కె. నాయుడు, చిన్నా, విజయ్, ఎస్.ఆర్.శేఖర్, విజయరామ్ ప్రసాద్ సాంకేతిక వర్గం, కో-ప్రొడ్యూసర్: సురేష్ రెడ్డి, నిర్మాత: వెంకట్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్


Click it and Unblock the Notifications











