బిజినెస్ మేన్ ఐఫోన్ అప్లికేషన్స్
రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెలుతున్న మహేష్ బాబు 'బిజినెస్ మేన్' సినిమాకు దర్శక నిర్మాతలు మరింత ప్రచారం కల్పిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్‌గా ఈ చిత్రాన్ని నిలబెట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును పుస్తకం రూపంలో విడుదల చేస్తామని పూరి జగన్నాథ్ ప్రకటించారు. తాజాగా 'బిజినెస్ మేన్' ఐఫోన్ అప్లికేషన్స్ అందుబాటులోకి తెచ్చారు. వీటిని వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా పూరి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
మహేష్ బాబు-కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 13 విడుదలై సంచలనాలు నమోదు చేస్తుంది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు రికార్డు స్థాయిలో దాదాపు రూ. 18 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ సినిమా అతి పెద్ద కమర్షియల్ హిట్ సినిమాగా నిలిచింది.
సినిమా విడుదలై వారం గడిచింది. కలెక్షన్లు బాగానే వస్తున్నప్పటికీ...సినిమా విడుదలకు ముందు ఉన్న హైప్ లేదని అంటున్నారు. మరి ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తుందో..? లేదో..? మరికొన్ని రోజులు గడిస్తేగానీ చెప్పలేం.


Click it and Unblock the Notifications











