'ది బిజినెస్ మ్యాన్' కొత్త డైలాగులు ఇవే
మహేష్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ది బిజినెస్ మ్యాన్. ది బిజినెస్ మ్యాన్ లో మరో రెండు డైలాగులు బయిటకు వచ్చాయి. అవి..
“నేను కొడితే ఎలా ఉంటదో ఆళ్లూ ఈళ్లూ చెప్పటమే కాని నాకు తెలియదు"
'యుద్దం చేతకాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు'
ఇక మహేష్ బాబు దూకుడుతో పెరిగిన మార్కెట్ కు అణుగుణంగానే బిజినెస్ మ్యాన్ ఉండబోతోందని చెప్తున్నారు. అందులోనూ గతంలో మహేష్,పూరీ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మెగా హిట్ ఫిలిం కావటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఉన్నాయి. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో కథ నడవనుంది. తెలుగు,తమిళ్,మళయాళ భాషల్లో జనవరి 11న ఈచిత్రం విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దూకుడు ఆడియో మంచి విజయం సాధించటంతో అతన్నే ఈ సినిమాకు మహేష్ ఎంచుకున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నిమిత్తం వదిలిన ఫస్ట్ లుక్ ట్రైలర్ అందరి ప్రశంసలూ పొందుతోంది. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో విడుదల అవనున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో విజేతగా నిలిచి దూకుడు రికార్డులను బ్రద్దలు కొడుతుందని మహేష్ ఫ్యాన్స్ సైతం ఆశలు పెట్టుకున్నారు. ఇక మహేష్ కి తెలుగు సహా తమిళ్‌లోనూ భారీ మార్కెట్ ఉంది. ముఖ్యంగా చెన్నైలో లో అతని వీరాభిమానులు ఉన్నారు. డిసెంబర్ 23న పాటలు మార్కెట్లోకి వస్తాయి. ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్క్రీన్ చేయనున్నారు. ఓవర్ సీస్ లో సెటిలైన తెలుగువారు కాని మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మొట్టమొదటి సబ్ టైటిల్స్ తో వస్తున్న తెలుగు చిత్రం కావటం మరో రికార్డుగా అభివర్ణిస్తున్నారు.


Click it and Unblock the Notifications











