twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బిజినెస్ మ్యాన్' ప్రీ రిలీజ్ టాక్ ఏంటి?

    By Srikanya
    |

    ఈ వారంలో విడుదల అవుతున్న క్రేజీ చిత్రం బిజినెస్ మ్యాన్. ఇక ఈ చిత్రం గురించి ఇండస్ట్రీలో రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్రం పస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా పంచ్ డైలాగులతో,అదిరిపోయే సాంగ్ లతో గంట సేపూ అస్సలు జరిగినట్లే తెలియకుండా ఐపోతుంది. ముఖ్యంగా సార్ వస్తారొస్తారా..అనే రెండో పాట హైలెట్ గా చిత్రీకరణ కూడా ఉంది. ఇక సెకండాఫ్ కొద్దిగా స్లో అయినా క్లైమాక్స్ కి వచ్చేసరికి పుంజుకుంటుంది. ఆ స్లో కూడా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకునే కానీ.. అంతకుమించి మరేమీ కాదు అంటున్నారు.

    అలాగే ఈ చిత్రం రన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉండటంతో చూసే ఆడియన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతారని, టైట్ స్క్రిప్టుతో, ఫైట్స్,పాటలతో ఓ రంగవల్లిగా చిత్రం పూరీ తీర్చిదిద్దాడని, పోకిరి మించిన ఇంటెన్సిటీ కథలో ఉందని చెప్తున్నారు. సినిమా విడుదల అయ్యాక డైలాగ్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారని, అప్పట్లో పోకిరి డైలాగులకు ఎంత క్రేజ్ వచ్చిందో అంతకు మించి ఈ చిత్రం డైలాగులు వర్కవుట్ అవుతాయని చెప్తున్నారు. ఇక తమన్ అందించిన పాటల్లో మూడు కేక పెట్టించే రీతిలో ఉన్నాయని ఇప్పటికే ఆడియో ప్రూవ్ చేసింది. పూరీ స్టైలిష్ టేకింగ్,మహేష్ నటన,కాజల్ అందం చిత్రానికి హైలెట్ అని చెప్తున్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ ఒక్కటే ఉన్నా మహేష్ తనదైన శైలిలో ఫన్ పండించి ఆ లోటు కనపడనీయడని చెప్తున్నారు. టిక్కెట్టుకు తగిన ఎంజాయిమెంట్ ఈ చిత్రంతో దక్కుతుందని ప్రీ రిలీజ్ టాక్.

    English summary
    Businessman will be a minimum guarantee film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X