యూఎస్‌లో ‘బిజినెస్ మేన్’ 114 సెంటర్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'బిజినెస్ మ్యాన్' సినిమా యూఎస్ లో రికార్డు స్థాయి సెంటర్లలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా మొత్తం 114 సెంటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు విశ్వసనీయంగా అందిన సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం ఆంద్రప్రదేశ్, ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో పదకొండు వందలకు పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరన కాజల్ అగర్వాల్ తొలిసారిగా రొమాన్స్ చేస్తోంది. మెంబై మాఫియా, ఆయుధాల వ్యాపారం నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథాశం నేపథ్యంలో ఎక్కువ శాతం షూటింగ్ ముంబైలోనే జరిగింది. ఎస్ ఎస్ తమన్ అందించిన సంగీతం ఇప్పటికే శ్రోతల మనసు గెలుచుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు, పూరి జగన్నాథ్ పాడిన పాట అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ చిత్రం అత్యంత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











