పవన్ కళ్యాణ్ 30 అయితే..మహేష్ బాబు 33
మహేష్ బాబు తాజా సినిమా 'బిజినెస్ మేన్' ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో రికార్డు స్థాయి షోలతో చరిత్ర సృష్టించనుంది. ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో ఒక రోజులో మొత్తం 36 షోలు వేసే అవకాశం ఉంది. బిజినెస్ మ్యాన్ సినిమా తొలి రోజు ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లోని కంటిన్యూస్‌గా 33 షోలు వేస్తున్నారు. మూడు షోలు మాత్రమే వేరే సినిమాలు ఉంటాయి. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'తీన్ మార్' చిత్రం తొలి రోజు ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో 30 షోలు ప్రదర్శింపబడింది. ఇప్పడు దాన్ని బిజినెస్ మేన్ అధిగమించనుంది.
పూరి జగన్నాథ్ దర్వకత్వంలో మహేష్ బాబు-కాజల్ జంటగా, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో, థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన 'బిజినెస్ మేన్' సినిమా ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా చరిత్రలోనే గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











