ఖైదీలకు ‘బిజినెస్ మేన్’-పూరికి రెండు రోజుల రిమాండ్!

By Bojja Kumar

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గనతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చర్లపల్లి జైలును సందర్శించారు. జైలు గోడల మధ్య బంధీలైన వారికి సినిమాలు చూసే అవకాశం లేక పోవడంతో.... ఈ సందర్భంగా వారికి 'బిజినెస్ మేన్' సినిమాను కానుకగా ఇస్తున్నట్లు తెలిపారు. జైల్లోనే షో ఏర్పాటు చేసే ఏర్పాట్లు చేస్తామన్నారు. పూరి రాక సందర్భంగా ఖైదీలకు మరో కానుక కూడా అందింది. అధికారులు 'ఫోన్ జీవో'జారీ చేశారు. ఈ జీవో ద్వారా ఖైదీలకు తమ వారితో మాట్లాడే అవకాశం కల్పించనున్నారు.

ఈ సందర్బంగా పూరి మాట్లాడుతూ.....బంగారు కడ్డీలతో చేసినా, జైలు జైలే, స్వేచ్చ లేక పోవడం నరకమే. నేను కూడా కాలేజీ రోజుల్లో ఓ గొడవ కేసులో నన్ను పోలీసులు పట్టుకెళ్లారు, రెండు రోజులు రిమాండ్‌లో ఉన్నాను, చాలా బాదేసింది, నా కోసం స్నేహితులు బిర్యానీ తీసుకొచ్చారు అంటూ తన గత అనుభవాలను రివైండ్ చేశారు పూరి జగన్నాథ్.

పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నాడని ఓ ఖైదీ ప్రశ్నించగా...ఈ సంవత్సరంలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ కి నేను కూడా పెద్ద అభిమానిని అని పూరి చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X