దండి ఓపెనింగ్సే మహేష్ టార్గెట్?
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న బిజినెస్ మ్యాన్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. పూరిజగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై డా. వెంకట్ నిర్మిస్తున్నారు.
బిజినెస్ మేన్ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టాలనే టార్గెట్ తో హీరో, దర్శక నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం 1100 థియేటర్లు సిద్ధం చేయగా, సంక్రాంతి బరి నుంచి రవి తేజ 'నిప్పు' సినిమా తప్పుకోవడంతో మరిన్ని థియేటర్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ మేన్‌పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో థియేటర్ల సంఖ్యను మరింత పెంచి ఆ హైప్‌ను సొమ్ము చేసుకోవాలనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది.
ఆ సంగతి పక్కన పెడితే...ఇప్పటికే యూనివర్సల్, ఐడియా లాంటి బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్న మహేష్ బాబు, తాజాగా కొత్త సంవత్సరం 'సంతూర్' కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరో వైపు వరుస సినిమా షూటింగులతో బిజీబిజీగా గడుపుతున్నాడు. దీన్ని బట్టి 2012లో దండిగా సంపాదించడమే మహేష్ బాబు లక్ష్యం పెట్టుకున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











