టాలీవుడ్ మైండ్ బ్లాంక్ చేస్తున్న మహేష్ బాబు కొత్త స్ట్రాటజీ...!

By Sindhu

మహేష్ బాబు కొత్త స్ట్రాటజీ టాలీవుడ్ మైండ్ బ్లాంక్ చేస్తుంది. వరుస ఫ్లాప్ లు తరువాత ప్లాన్ మార్చుకున్న మహేష్ నిర్మాతలు ఆశ్చర్య పోయే రేంజ్ లో సినిమాలు తీస్తున్నాడు. తన గత ట్రాక్ రికార్డ్ కు భిన్నంగా సంవత్సరాలు తరబడి సాగదీయడం అనే విషయాన్ని పక్కన పెట్టారు. సంవత్సరాలు తరబడి సినిమాలు తీసినంత మాత్రాన గొప్పగా తీసినట్టు కాదు. పైగా అలా తీసినవి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఫర్వాలేదు గాని, యావరేజో, ఫ్లాఫ్ గాని అయ్యిందంటే ఇక ఆ నిర్మాత నష్టాల్లో కూరుకుపోయినట్టే. ఖలేజాతో జరిగింది ఇదే. అందుకే మహేష్ తన స్ట్రాటజీ మార్చేసాడు.

వరుసగా సినిమాలు చేయడమే కాదు, ఫాస్ట్ గానూ ముగించేలా చేస్తున్నాడు. మహేష్ బాబు త్రివిక్రమ్ డైరక్షన్ లో వచ్చిన ఖలేజా రెండేళ్లు షూటింగ్ జరుపుకుంది. మహేష్ తాజా సినిమా బిజినెస్ మెన్ మాత్రం రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. కేవలం సినిమా మొదలయినప్పటి నుంచి రెండు నెలలు వ్యవధిలోనే (74రోజుల్లో షూటింగ్ ముగించేశారు ) బిజినెస్ మెన్ షూటింగ్ పూర్తయిపోయింది. రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో ఫాస్ట్ గా సినిమాలు తీయడం అనే విషయాన్ని అలవర్చుకుంది కేవలం పూరి జగన్నాథ్ మాత్రమే. బిజినెస్ మెన్ విషయంలో పూరి మరో సారి తను ఎంత ఫాస్ట్ అనే విషయం టాలీవుడ్ కు చూపించాడు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బిజినెస్ మెన్ లో మహేష్ సరసన కాజల్ హీరోయిన్ గా కనిపించబోతుంది.

ఇదిలా ఉండగా దాదాపు నెల రోజల తర్వాత మహేష్ బాబు ట్విట్టర్ లో ఓ వార్తను పొందుపరిచాడు. అది 'ది బిజినెస్ మ్యాన్' సినిమా గురించి. ఇప్పటి వరకు తను నటించిన అన్ని చిత్రాల్లోకెల్లా 'ది బెస్ట్ లుక్' అనదగ్గది బిజినెస్ మ్యాన్ లోని లుక్ అని మహేష్ బాబు అన్నాడు. ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించడం ఖాయం అని కూడా పేర్కొన్నాడు. జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు ఈ విడుదల కోసం చాలా ఎక్సయిటింగ్ గా ఎదురు చూస్తున్నానని కూడా మహేష్ బాబు అందులో పేర్కొన్నాడు. తమన్ సంగీతం అందిస్తున్ ఈ చిత్రం ఆడియో ఈనెల(డిసెంబర్) 22న శిల్పకళా వేదికలో భారీ స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X