అక్కడ మహేష్ బాబు లేట్ అందుకేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్టారే. బాబు సినిమా విడుదలైతే రికార్డులు బద్దలు కావాల్సిందే, కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అదీ మహేష్ బాబు స్టామినా. కానీ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మహేష్ బాబు సినిమాలకు ఈ రేంజ్ లో క్రేజ్ ఉండదనేది కాదనలేని వాస్తవం.
అసలు విషయానికొస్తే...మహేష్ బాబు తాజా సినిమా 'బిజినెస్ మేన్' సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళం, మళయాళం కూడా అదే రోజు విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు దర్శక నిర్మాతలు. అయితే ఆ రెండు రాష్ట్రాల్లో ఆరోజు 'బిజినెస్ మ్యాన్' సినిమా విడుదల సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. పండగ సీజన్ కావడంతో తమిళ, మలయాళ సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడుతుండటంతో మహేష్ బాబు సినిమాకు థియేటర్లు కరువయ్యాయి. దీంతో ఈ చిత్రాన్ని అక్కడ రెండు వారాలు ఆలస్యంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యారు.
పూరి దర్శకత్వంలో మహేష్ బాబు, కాజల్ జంటగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన 'బిజినెస్ మేన్' సినిమా ముంబై మాఫియా, ఆయుధాల వ్యాపారం కథాంశంతో సాగుతుంది.


Click it and Unblock the Notifications











