'బిజినెస్ మ్యాన్ ఫ్లాప్' అంటూ వర్మ ట్వీట్
"హ..హ..హ..ఇప్పుడే పూరీ తన బిజినెస్ మ్యాన్ 2 స్టోరీ నేరేట్ చేసారు. బిజినెస్ మ్యాన్ 2 ముందు బిజినెస్ మ్యాన్ ప్లాప్ క్రింద లెక్క. బిజినెస్ మ్యాన్ 2 లోని మహేష్ క్యారక్టరైజేషన్ వింటూంటే నమ్మలేకపోయాను. బిజినెస్ మ్యాన్ లో టెర్రఫిక్ గా చేసిన దాని కన్నా చాలా చాలా బాగుంది" అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. ఈ వార్త మహేష్ అభిమానులను చాలా ఆనందపరుస్తుంది. ఇక బిజినెస్ మ్యాన్ 2 ఈ సంవత్సరం చివరలో పూరీ ప్రారంభించనున్నారు.
ఈ లోగా రవితేజ తో దేముడు చేసిన మనుష్యులు చిత్రం ఫినిష్ చేస్తారు. మరో ప్రక్క వర్మ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ని హిందీలో రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. రణబీర్ కపూర్ ని హీరోగా అడుగుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసి రణబీర్ కి చూపించటం జరిగింది. అయితే ఇంకా ఈ ప్రాజెక్టు ఖరారు కాలేదు. ఓకే అయ్యితే వర్మ నిర్మాతగా పూరీ డైరక్టర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం వర్మ డిపార్టమెంట్ చిత్రం బిజీలో ఉన్నారు. ఆ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అందులో రానా,లక్ష్మి ప్రసన్న కూడా నటించారు.


Click it and Unblock the Notifications











