»   » తెలిసినా లెక్కచేయలేదంటూ...పవన్‌‌పై రాజమౌళి కామెంట్

తెలిసినా లెక్కచేయలేదంటూ...పవన్‌‌పై రాజమౌళి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ కూటమి ఘనవిజయం సాధించడంలో, కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ నినాదంతో అధికార పార్టీని పడగొట్టడంలో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక పోషించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రయత్నం ఫలించడంతో పలువురు ఆయనపై ప్రశంసులు గుప్పిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు గుప్పించారు. 'ఒక వేళ ఎన్నికల ఫలితాలు అనుకున్న విధంగా రాక పోతే భవిష్యత్‌లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్‌కు ముందే తెలుసు. కానీ ఆయన వాటిని లెక్క చేయలేదు. తాను నమ్మిన విధానాలతోనే ముందుకు సాగారు. సొంతగా పార్టీ స్థాపించినప్పటికీ టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించడానికే ఎన్నికలకు దూరంగా ఉండటం అనేది చరిత్రలో నిలిచిపోయే అంశం. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయని ఆశిస్తున్నాను' రాజమౌళి వ్యాఖ్యానించారు.

 But Pawan Kalyan didn’t care: Rajamouli

మరో వైపు రాజమౌళి ప్రచార బాధ్యతలు చేపట్టిన లోకసత్తా పార్టీ ఎన్నికల్లో పరాభవం పాలైన సంగతి తెలిసిందే. ఈ విషయమై రాజమౌళి స్పందిస్తూ...'లోక్ సత్తా పార్టీపై ప్రజలకు నమ్మకం కలిగించడంలో మేము పూర్తిగా విఫలం అయ్యాయి. జయప్రకాష్ నారాయణ, లోక్ సత్తా పార్టీ మనీ పవర్ రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకం అని నమ్మి ఓటు వేసిన లక్షన్నరకుపైగా ఓటర్లకు సిన్సియర్‌గా థాంక్స్ చెబుతున్నాను' అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు.

English summary
Rajamouli said that, “PK knew he would have faced a tough time had the results been contrary,but he didn’t care.He took a firm step towards what he believed in..His decision not to contest and instead support NDA will remain a vital point in history. Hope the new govt will make proper use of it…”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu