నాగ్ ‘డమరుకం’ మూవీని కొనేవాళ్లు కరువు!
నాగార్జున హీరోగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ రూపొందించిన చిత్రం 'డమరుకం' చిత్రానికి పెద్ద చిక్కే వచ్చి పడినట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లెవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారట.
నాగార్జున కెరీర్లోనే ఈచిత్రం భారీ బడ్జెట్‌తో దాదాపు రూ. 40 కోట్లు ఖర్చు పెట్టి భారీ గ్రాఫిక్స్ కలగలిపిన సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందించారు. అసలు తెలుగు సినిమా రేంజికే ఇది భారీ బడ్జెట్. వాస్తవానికి నాగార్జునకు రూ. 20 కోట్లకు మించిన మార్కెట్ లేదని, అలాంటి పరిస్థిత్లుల్లో అంతకు రెండింతలు ఖర్చు పెట్టి తీయడం ఏమిటని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
కొందరు ముందుకు వచ్చినా...నిర్మాతలు చెబుతున్న రేటు చెల్లించి దక్కించుకోవడానికి వారు సిద్ధంగా లేరు. దీంతో తమ సినిమాను తాను చెప్పిన రేటుకు కొనే బయ్యర్ల కోసం ఎదరు చూస్తున్నారు నిర్మాతలు. మరి ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి నిర్మాతలు ఎలా బయట పడతారో చూడాలి.
కె. అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో డా. వెంకట్ నిర్మిస్తున్న 'డమరుకం' చిత్రం జూలై రెండో వారంలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, సమీర్, శ్రవణ్, రాజా శ్రీధర్, ప్రభు, కమల్, ప్రగతి రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: చోటాకె నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, డాన్స్: రాజు సుందరం, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: వెంకట్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.


Click it and Unblock the Notifications











