twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీరియాడిక్ డ్రామాలో పవన్.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే.. అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న క్రిష్

    |

    పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపిస్తే.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తెరపై పవర్ స్టార్ కనిపిస్తే చాలు.. ఇంకేమీ అవసరం లేదనే అభిమానులు కోకొల్లలు. అదంతా కేవలం సినిమాల వల్లే వచ్చిన క్రేజ్ అనుకుంటే పొరపాటే. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరగుతూ వచ్చింది. పుష్కర కాలం పాటు విజయమన్నది దరికి చేరకున్నా.. సరైన సమయం కోసం ఎదురుచూశాడు. గబ్బర్ సింగ్ సినిమాను తీసి అభిమానుల కోరికను తీర్చాడు. మళ్లీ పూర్వ వైభవాన్ని చవిచూశాడు. కెరీర్ తారాస్థాయిలో ఉండగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

    రాజకీయాల్లోకి ఎంట్రీ..

    రాజకీయాల్లోకి ఎంట్రీ..

    సినిమాల్లోని తన మ్యానరిజానికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ అభిమానులే. నిజ జీవితంలో పవన్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వారే ఎక్కువ. అందుకే సినీ హీరోగా కంటే.. ఓ మంచి మనిషిగా పవన్‌ను అభిమానిస్తుంటారు ఫ్యాన్స్. గత అనుభవాలను దృష్టిలోకి పెట్టుకుని పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జనసేన పార్టీకి.. పెద్ద షాక్ తగిలింది.

    ఘోర పరాజయం చవిచూసిన జనసేన..

    ఘోర పరాజయం చవిచూసిన జనసేన..

    ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలవడంతో అందరూ అవాక్కయ్యారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.జనసేన పార్టీ అంతగా విజయం సాధించకపోయే సరికి.. మళ్లీ సినీ ఇండస్ట్రీకి వచ్చి సినిమాల్లో నటించబోతున్నాడనే వార్తలు ఊపందుకోసాగాయి. అప్పట్లో వచ్చిన వార్తలను పవన్ కళ్యాణ్ ఖండించినా.. రూమర్లు మాత్రం ఆగడం లేదు. తాను పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తున్నా.. ఆయన రీఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి.

    Recommended Video

    Do You Think Pawan Kalyan Will Step Into Movies Again? || పవన్ నుంచి సినిమా కావాలా? వద్దా?
    పీరియాడిక్ డ్రామా..

    పీరియాడిక్ డ్రామా..

    పవన్ కళ్యాణ్ కథలు వింటున్నాడని, అందులో క్రిష్ చెప్పిన కథ బాగా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. అదొక పీరియాడిక్ డ్రామా అని బయటకు రావడం మరింత ఉత్కంఠగా మారింది. ఈ చిత్రాన్ని ఖుషీ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మించబోతోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్.. స్క్రిప్ట్‌కు సంబంధించిన పనులను పూర్తి చేసే పనిలో పడ్డట్లు టాక్. ఈ వార్తలతో అభిమానుల్లో మళ్లీ ఆశ చిగురించింది. తమ అభిమాన హీరోను మళ్లీ తెరపై కళ్లారా చూసుకునే అవకాశం రానుందని సంబరపడుతున్నారు.

    భారీ రెమ్యూనరేషన్..

    భారీ రెమ్యూనరేషన్..

    ఈ కాలంలో హీరోలు, డైరెక్టర్లు.. రెమ్యూనరేషన్ కాకుండా వాటాలు, షేర్లు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే వాటాలు, షేర్ల రూపంలోనే ఎక్కువ మొత్తంలో చేతికి అందుతుండగా.. వాటి వైపే మొగ్గుచూపుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అవేవీ లేకుండా నేరుగా 50కోట్ల వరకు తీసుకోనున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. డిసెంబర్ రెండో వార్ంలో ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలు కూడా రూమర్లు గానే మిగిలిపోతాయో లేదా వాస్తవ రూపం దాల్చుతాయా? అన్నది కాలమే నిర్ణయించాలి.

    English summary
    పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపిస్తే.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తెరపై పవర్ స్టార్ కనిపిస్తే చాలు.. ఇంకేమీ అవసరం లేదనే అభిమానులు కోకొల్లలు. అదంతా కేవలం సినిమాల వల్లే వచ్చిన క్రేజ్ అనుకుంటే పొరపాటే. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరగుతూ వచ్చింది. పుష్కర కాలం పాటు విజయమన్నది దరికి చేరకున్నా.. సరైన సమయం కోసం ఎదురుచూశాడు. గబ్బర్ సింగ్ సినిమాను తీసి అభిమానుల కోరికను తీర్చాడు. మళ్లీ పూర్వ వైభవాన్ని చవిచూశాడు. కెరీర్ తారాస్థాయిలో ఉండగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X