పవన్‌ తో త్రివిక్రమ్ సినిమా ఎప్పుడంటే...:బీవీయస్‌యన్ ప్రసాద్

By Srikanya

హైదరాబాద్ :పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో చిత్రం నిర్మించటానికి ప్రోడ్యూసర్ బీవీయస్‌యన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మీడియాతో మాట్లాడుతూ..'' సెప్టెంబరు నుంచి పవన్‌కళ్యాన్‌తో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుంది. దాదాపుగా అందరు హీరోలనూ, ప్రముఖ దర్శకులతోనూ సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. ఆయన తాజా చిత్రం దేముడు చేసిన మనుష్యులు రేపు అంటే ఆగస్టు 15న విడుదల అవుతున్న సందర్బంగా మీడియాతో మాట్లాడారు.

అలాగే ''ప్రస్తుతం గోపీచంద్-చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. రామ్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కూడా మరోవైపు తయారవుతోంది.పాతికేళ్ల నుంచి ఈ పరిశ్రమలో ఉన్నా ఎక్కువ సినిమాలు చేయాలన్న నా కోరిక తీరలేదు, అన్నీ కరెక్ట్‌గా కుదరడంతో వరుసగా సినిమాలు చేస్తున్నాను, నా కుమారుడు బాపినీడు కూడా అండగా నిలబడుతున్నాడు '' అన్నారు.

ఇక దేముడు చేసిన మనుష్యులు గురించి మాట్లాడుతూ..''రవితేజతో నాకిది మూడో సినిమా. ఈ పాతికేళ్లలో నాకు బాగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏదంటే రవితేజతో నేను తీసిన 'ఈ అబ్బాయి చాలా మంచోడు'. ఆ తర్వాత 'ఖతర్నాక్' సినిమా. ఇప్పుడేమో దేవుడు చేసిన మనుషులు. ఇది తప్పక హిట్టవుతుంది. నా జడ్జిమెంట్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు'' అని నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ చెప్పారు. రవితేజ, ఇలియాన జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రసాద్ నిర్మించిన 'దేవుడు చేసిన మనుషులు' బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో జల్సా సినిమా వచ్చి విజయవంతం అయ్యింది. తాజాగా మరో సినిమా తెరకెక్కనుంది. ఈ విషయమై త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాకు కన్పర్మ్ చేసి చెప్పారు. ఆ సినిమా ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతూ...నువ్వు నాకు నచ్చావు తరహా మానవ సంభంధాలతో ఉంటుందన్నారు.అలాగే తెలుగు సంప్రదాయలు,మానవ భాంధవ్యాలు ప్రధానంగా ఇందులో కనిపించేలా కథను రెడీ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు అనంతరం ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X