Project K : దీపిక హెల్త్ ఇష్యూ మీద అసలు విషయం చెప్పిన నిర్మాత.. గిల్టీగా ఫీల్ అయిందంటూ!

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో జరుగుతున్న ప్రాజెక్టు కె సినిమా షూటింగులో దీపికా పదుకోన్‌ కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు అని కూడా అన్నారు. ఆ తర్వాత అదేమీ లేదని సినిమా పీఆర్ టీం నుంచి ఒక క్లారిటీ వచ్చింది. అయినా ఆ విషయం మీద వార్తలు రావడం ఆగలేదు. ఏకంగా దీపికకు యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయని చెబుతూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా నిర్మాత అశ్వినీదత్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లతో

ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లతో

మంగళూరుకు చెందిన దీపికా పదుకోన్‌ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఆమె క్రేజ్ దృష్ట్యా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లతో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అయితే ఆమె గురించి రెండు రోజుల క్రితం ఒక్కసారిగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

కళ్ళు తిరిగి పడిపోయిందని

కళ్ళు తిరిగి పడిపోయిందని


అసలు దీపికా పదుకోన్‌కు ఏమైంది? రెండు రోజుల క్రితం దీపికా పదుకోన్‌ ఎందుకు హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్లారు? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. హార్ట్ బీట్ విషయంలో ఆమె ఇబ్బంది పడడంతో సాధారణ చెకప్ కోసం వెళ్లారని సినిమా యూనిట్ అంటుంటే మీడియా వర్గాలలో మాత్రం ఆమె షూట్ చేస్తున్న సమయంలో కళ్ళు తిరిగి పడిపోయిందని వెంటనే హాస్పిటల్కు తీసుకు వెళ్లారు అని ప్రచారం జరిగింది.

జనరల్ చెకప్ కోసమే

జనరల్ చెకప్ కోసమే

ఈ విషయం మీద ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో బాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు, ప్రేక్షకుల దాకా అనేక అనుమానాలు నెలకొన్నాయి. గుండె సంబంధించిన ఇబ్బందితో బాధ పడుతూ దీపిక ఆసుపత్రికి వెళ్లారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని, బీపీలో హెచ్చుతగ్గులు ఉండటంతో జనరల్ చెకప్ కోసమే వెళ్లారని తాజాగా నిర్మాత అశ్వనీదత్ చెప్పారు. 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

నలతగా అనిపించడంతో

నలతగా అనిపించడంతో

దీపిక హెల్త్ బాగోలేని కారణంగా ప్రభాస్ షూటింగ్ వాయిదా వేయమని అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయని, అసలు ఆ విషయంలో ఏమాత్రం నిజం లేదని అశ్వనీదత్ చెప్పారు.నిజానికి సినిమా సెట్స్‌లో ఉండగా దీపికా పదుకోన్‌కు ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చెకప్స్ చేయించుకుని అక్కడ నుంచి నేరుగా మళ్ళీ సెట్స్‌కు వచ్చారు, అంతేకానీ అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అన్నారు.

గిల్టీగా

గిల్టీగా

నిజానికి దీపికకు ఈమధ్య కోవిడ్ వచ్చిందని, అది తగ్గిన తర్వాత యూరప్ వెళ్లారని అశ్వినీదత్ వెల్లడించారు. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ షూటింగ్ కోసం వచ్చారన్న ఆయన బీపీ లో అవుతూ హై అవుతూ ఉండడంతో రిస్క్ తీసుకోకుండా ఆసుపత్రికి వెళ్లారని అన్నారు. అక్కడి నుంచి గంటలోపే మళ్ళీ వచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, దీపికపై కొన్ని సీన్స్ తీస్తున్నామని, అయితే తన అనారోగ్యం వల్ల అమితాబ్ గంట సేపు వెయిట్ చేయాల్సి రావడంతో దీపికా పదుకోన్ గిల్టీగా ఫీల్ అయ్యారని అశ్వనీదత్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X