సూరి హత్యతో అజ్ఝాతంలోకి వెళ్లిన కళ్యాణ్ బయటికొచ్చాడు...
సూరి హంతకుడు భానుతో సంత్సంబంధాలు కొనసాగించాడని, అతనితో కలిసి భూములు కబ్జా చేశాడని నిర్మాత సి కళ్యాణ్ పై అభియోగాలు వెల్లువెత్తుతూ ఉండడంతో ఒక్కసారిగా ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. అయితే సి కళ్యాణ్ అదృశ్యమనే వార్త ఓ పత్రికలో ప్రముఖంగా రావడంతో తప్పనిసరిగా తాను బయటకి వచ్చి తీరాల్సిన అవసరం ఉందని గ్రహించి ఓ సినిమా వేడుకకి అతిథిగా హాజరయ్యాడు. సి కళ్యాణ్ అంటే ఒకప్పుడు చోటా నిర్మాత. చిన్న చిత్రాలు తీస్తూ చేతులు కాల్చుకునే ఈయన ఒక్కసారిగా బిజీ నిర్మాతగా మారాడు.
పెద్ద హీరోల చిత్రాల్లో భాగస్వామిగా చేరాడు. 'పులి", 'ఖలేజా" చిత్రాలని సగంలో టేకప్ చేసి వాటిని పూర్తి చేశాడు. ఆ తర్వాత రక్తచరిత్ర రెండు భాగాలనీ తెలుగులో రిలీజ్ చేశాడు. రీసెంట్ గా 'పరమవీర చక్ర" చిత్రాన్ని తన సొంత బ్యానర్ పై తనే నిర్మించాడు. చిన్న చితకా చిత్రాలు తీసుకునే వ్యక్తి ఒక్కసారిగా టాప్ ప్రొడ్యూసర్ గా అందునా బిజీ ప్రొడ్యూసర్ గా మారడంతోనే చాలా కనుబొమ్మలు పైకి లేచాయి. దాని వెనుక గుట్టు ఏంటో, కళ్యాణ్ కి అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందో ఇప్పడు క్లూస్ అందుతున్నాయి.
సూరి హత్య తర్వాత ఒక్కసారిగా తన మీదకు అందరి దృష్టి మళ్లేసరికి కళ్యాణ్ గాయబ్ అయిపోయాడు. అయితే పత్రికల్లో వార్తలు వచ్చేయడంతో తప్పనిసరిగా బయట కనిపించాల్సి వచ్చిందతనికి. అందుకే పిలవని పేరంటానికి వెళ్లిపోయి కెమెరాలకి కనిపించేలా కూర్చుని తానెక్కడికీ పోలేదని చూపించుకున్నాడు.


Click it and Unblock the Notifications











