భాను కిరణ్‌పై మాట మార్చిన నిర్మాత సి కళ్యాణ్!
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ వ్యవహారంలో మాట మార్చినట్లుగా కనిపిస్తోంది. కళ్యాణ్ మంగళవారం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ భానుకిరణ్ తనకు తెలియదని చెప్పినట్టుగా తెలుస్తోంది. భానుకిరణ్‌కు తాను బినామి అన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. సిఐడి కేసుల నుండి తాను త్వరలో తన నిజాయితీ నిరూపించుకొని బయట పడతానని చెప్పారు. బయటకు వచ్చాక అన్ని విషయాలను వెల్లడిస్తానని చెప్పారు.
కాగా చెన్నైలో నిర్మాత శింగనమల రమేష్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని దగ్గర నుండి సిసిఎస్ పోలీసులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తనకు భాను కిరణ్‌తో పరిచయం ఉందని, మద్దెలచెర్వు సూరి తనకు భానును పరిచయం చేశాడని చెప్పారు. శింగనమల తర్వాత అరెస్టు అయిన సి.కళ్యాణ్ సైతం తనకు భాను కిరణ్ తెలుసునని పోలీసుల ముందు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలను ఆయన ఖండించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











