ఎవరికి ఉండే గౌరవం వారికి ఉంది.. బాలయ్య వ్యాఖ్యలపై నిర్మాత వివరణ
కరోనా వైరస్ దెబ్బకు కుప్పకూలిని సినీ పరిశ్రను నిలబెట్టడానికి సినీ పెద్దలందరూ ముందుకు వచ్చారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపాడు. సినిమాటోగ్రఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లతో సినీ పెద్దలందరూ కలిసి చర్చించారు. త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తోనూ సినీ ప్రముఖులు భేటీ కానున్నారు.
అయితే ఇంత వ్యవహారం జరుగుతున్నా వాటిపై తనకు ఎలాంటి సమచారం లేదని నందమూరి బాలకృష్ణ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం లేపాయి. వీటిపై ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ స్పందించి వివరణ ఇచ్చాడు.

సినీ పెద్దల భేటీ..
లాక్ డౌన్ కారణంగా.. రెండు నెలలుగా స్థంభించిపోయిన సినీ పరిశ్రమను మళ్లీ పునరుద్దరించాలని సినీ పెద్దలంతా నడుం బిగించారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, కొరటాల శివ, త్రివిక్రమ్, రాధాకృష్ణ, దిల్ రాజు, సీ కల్యాణ్ లాంటి నిర్మాతలు సీఎం కేసీఆర్, వైఎస్ జగన్‌ను కలిశారు.

సమస్యలకు పరిష్కారం..
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదించగా.. సానుకూలంగా స్పందించాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పెద్ద మొత్తంలో గుమిగూడకుండా ఉండేలా షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇక థియేటర్ల పున: ప్రారంభం విషయం కొన్నిరోజులకు వాయిదా వేయాలని తెలిపింది.

బాలయ్య వ్యాఖ్యలు వైరల్..
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బయటకు వచ్చిన బాలయ్య మీడియాతో ముచ్చటించాడు. సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు, అలాగే ముఖ్యమంత్రులతో సినీ ప్రముఖులు సమావేశం అవుతున్న విషయం తనకు తెలియదని బాంబ్ పేల్చాడు. తనకు అలాంటి విషయాలపై సమాచారం లేదని చెప్పడం అందర్నీ విస్మయానికి గురి చేసింది.

ఎవరి గౌరవం వారిదే..
బాలయ్య వ్యాఖ్యలపై నిర్మాత సీ కళ్యాణ్ స్పందిస్తూ.. ప్రస్తుతం నిర్మాతలుగా తాము చిత్రీకరణ కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని తెలిపాడు. బాలకృష్ణ ఇప్పుడు నిర్మాతగా ఏ సినిమా చేయడం లేదని, అవసరమైనప్పుడు బాలయ్య మాతో చర్చల్లో పాల్గొంటారని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు జరిగిన ప్రతీ విషయాన్ని బాలయ్యకు తానే స్వయంగా చెప్పానని వెల్లడించాడు. ఇండస్ట్రీ అంతా ఒక్కటేనని ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశాడు. ఇండస్ట్రీలో ఎవరికి ఉండే గౌరవం వారికి ఉందని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











