twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిల్మ్ ఛాంబర్‌ ఎన్నికలు: సి కళ్యాణ్ ప్యానల్ గెలుపు, దిల్ రాజు ప్యానెల్ ఓటమి

    |

    తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్లో తాజాగా ప్రొడ్యూసర్ల సెక్టార్‌కి సంబంధించి ఎన్నికలు కూడా అదే స్థాయిలో జరిగాయి. పోటా పోటీగా సాగిన ఈ ఎన్నికల్లో సి. కల్యాణ్‌ నేతృత్వంలోని 'మన ప్యానెల్‌' విజయం సాధించింది.

    మొత్తం 1438 మంది సభ్యులు ఉండగా...... మన ప్యానెల్, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్‌గా విడిపోయిన సభ్యులు చాంబర్లో ఆధిపత్యం కోసం పోటీ పడ్డారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ తరుపున దిల్ రాజు, డీవీవీ దానయ్య, సాయి కొర్రపాటి పోటీ పడ్డారు. మన ప్యానెల్ తరుపున సి కళ్యాణ్, వైవిఎస్ చౌదరి, నట్టి కుమార్ పోటీ పడ్డారు.

    C Kalyan Mana Panel Won In Film Chamber Elections

    శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మొత్తం 12 మంది ఈసీ సభ్యులకుగాను సి. కళ్యాణ్‌‌కు చెందిన 'మన ప్యానెల్‌' నుంచి 9 మంది విజయం సాధించారు.

    దిల్‌రాజు నేతృత్వంలోని యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌ ప్యానెల్ నుంచి కేవలం ఇద్దరు(దిల్ రాజు, దామోదర్) మాత్రమే గెలుపొందారు. ఈ రెండు ప్యానల్స్‌కు సంబంధం లేకుండా మోహన్‌ గౌడ్ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 20 మంది సెక్టార్‌ సభ్యుల స్థానాలకుగాను 16 మంది మన ప్యానెల్ నుంచి విజయం సాధించడం గమనార్హం. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్‌ నుంచి కేవలం నలుగురు మాత్రమే విజయం సాధించారు.

    English summary
    C Kalyan's Mana Panel Won In Film Chamber Elections. Mana Panel Win 9 Seats. Dil Raju's Active producer panel win only 2 seats.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X