అంత రేటా? షాకిస్తున్న చిల్లర కళ్యాణ్ ‘తాండవం’
పలు కేసుల్లో ఇరుక్కుని ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా మారిన నిర్మాత సి కళ్యాణ్ మళ్లీ లైన్లోకి వచ్చారు. తాజాగా ఆయన తమిళ హీరో విక్రమ్ నటించిన 'తాండవం' చిత్రం యొక్క తెలుగు రైట్స్ దక్కించుకుని మళ్లీ సినిమా వ్యాపారం షురూ చేశారు. ఈ హక్కుల కోసం సి కళ్యాణ్ రూ. 6 కోట్లు చెల్లించినట్లు సమాచారం. కళ్యాణ్ ఈ రేంజిలో ఖర్చు పెట్టడం పరిశ్రమ వర్గాలను షాక్‌కు గురి చేస్తోంది. విక్రమ్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండటం, జగపతిబాబు కూడా నటిస్తుండటంతో ఆయన ఇంతపెద్ద మొత్తం పెట్టేందుకు ధైర్యం చేసినట్లు స్పష్టం అవుతోంది.
గతంలో బాలయ్యతో పరమవీర చక్ర చిత్రం నిర్మించి నష్టపోయిన కళ్యాణ్...అనంతరం పలు భూకబ్జా కేసుల్లో ఇరుక్కోవడంతో పాటు, సూరి హంతకుడు భానుతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భాను క్రైం చేసి సంపాదించిన డబ్బుకు కళ్యాణ్ బినామీగా ఉన్నారని....సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. నట్టి కుమార్ అయితే ఈ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు.
తాండవం చిత్రం వివరాల్లోకి వెళితే...
విక్రమ్ కథానాయకుడిగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం 'తాండవం'. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. యు.టి. వి.మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సిద్ధార్థరాయ్‌కపూర్ నిర్మాత. అనుష్క, లక్ష్మీరాయ్, ఎమీజాక్సన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు.
ఇందులో విక్రమ్ పూర్తి వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. గత చిత్రాలకు భిన్నంగా ఆయన పాత్ర చిత్రీకరణ వుంటుంది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబు పాత్ర సినిమాకు ప్రత్యేకార్షణగా నిలుస్తుంది. అత్యున్నత ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
జి.వి ప్రకాష్‌కుమార్ సంగీతాన్నందిస్తున్నాడు. ప్రస్తుతం లండన్‌లో చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్యక్షికమాలు జరుగుతున్నాయి. షాయాజీ షిండే, నాజర్, కోట శ్రీనివాసరావు, శంతనమ్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈచిత్రం సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











