twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్‌ బాబు లేఖపై స్పందించిన సీ కళ్యాణ్.. ఐక్యత లేదంటారే.. ఆయన కూడా నిర్మాతేగా!

    |

    సినిమా టికెట్ల ఇష్యూలో పెదరాయుడు లాగా ఎంట్రీ ఇచ్చిన డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి అని చెబుతూ ఒక పెద్ద లేఖ రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆయన నిర్మాతలను టార్గెట్ చేయగా ఇప్పుడు నిర్మాతల మండలి అధ్యక్షుడు చిల్లర కళ్యాణ్ ఈ విషయం మీద స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

    బహిరంగ లేఖ కలకలం

    బహిరంగ లేఖ కలకలం

    ఇండస్ట్రీ పెద్దగా తాను ఉండలేనని మెగాస్టార్‌ చిరంజీవి కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే మోహన్‌ బాబు బహిరంగ లేఖ రాసి కలకలం రేపారు. తన మౌనం చేత కానితనం, చేవ లేనితనం కాదని ఘాటుగా లేఖ మొదలు పెట్టిన మోహన్‌ బాబు. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని చెప్పుకొచ్చారు.

    సరైన ధరలు ఉండాలి

    సరైన ధరలు ఉండాలి

    సినిమా పరిశ్రమలో అందరూ సమానమేనన్న ఆయన సినీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తా ధిపత్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత రేట్ల విధానంతో సినిమాలు నిలబడడం కష్టం అని పేర్కొన్న ఆయన 300 టికెట్ తో చిన్న సినిమాలు, అంత కన్నా తక్కువతో పెద్ద సినిమాలు ఆడలేవని అన్నారు. అయితే చిన్న సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు ఆడాలని పేర్కొన్నారు. సినిమాలు ఆడాలంటే సరైన ధరలు ఉండాలన్నారు మోహన్‌బాబు.

    కలిసి నడుద్దాం

    కలిసి నడుద్దాం

    అందరూ కలిసి రావాల్సిన టైం వచ్చిందన్న మోహన్ బాబు ముందుకు రండి కలిసి నడుద్దాం అని పిలుపునిచ్చారు. అసలు అన్నింటికీ మూలం నిర్మాతలే అని, ఇలాంటి కీలక సమయంలో అసలు నిర్మాతలు ఏమయ్యారని ప్రశ్నించారు మోహన్‌బాబు. వాళ్లు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఈ ఇష్యూను భుజాల మీద వేసుకోకుండా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు ఉందో కూడా అర్థం కావడం లేదని మోహన్‌ బాబు పేర్కొన్నారు. రండి ఇద్దరు సీఎంల దగ్గరకు వెళదాం, సమస్యలు చెప్పుకుందాం అంటూ ఓపెన్‌ రిక్వెస్ట్‌ కూడా చేశారు.

     మోహన్ బాబు ఫ్యామిలీ సినిమా రంగంలోనే

    మోహన్ బాబు ఫ్యామిలీ సినిమా రంగంలోనే

    తాజాగా మోహన బాబు రాసిన లేఖపై నిర్మాతల మండలి అధ్యక్షుడు చిల్లర కల్యాణ్‌ స్పందించారు. కల్యాణ్‌ మాట్లాడుతూ.. 'ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యల పై తాజాగా ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉందని అన్నారు. అలాగే మోహన్ బాబు ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉందని గుర్తు చేసిన ఆయన ఆయన ముందుండి సమస్యలను పరిష్కరిస్తానని అంటే ఆయన వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.

    Recommended Video

    Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
    ఐక్యత లేనందు వల్లే

    ఐక్యత లేనందు వల్లే

    ఇక నిర్మాతల్లో ఐక్యత లేనందు వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మోహన్ బాబు అన్నారు కానీ మోహన్ బాబు కూడా నిర్మాతే కదా, ఆయన కొడుకు కూడా నిర్మాతేనాని గుర్తు చేశారు. ఈ సమస్యల్ని ముందుండి పరిసారిస్తామంటే మేమంతా ఆయనతో పాటు ఉంటాం' అని సి కళ్యాణ్ అన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం మీద రామ్ గోపాల్ వర్మ కూడా కామెంట్స్ చేస్తున్న క్రమంలో ఈ వ్యవహారంలో మీద మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

    English summary
    C kalyan Responds to letter written by Mohan Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X