twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూజాభట్‌ 'క్యాబరే' తో సంచలనం

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్‌ భట్‌ కుమార్తెగా పరిశ్రమలో ప్రవేశించిన పూజా భట్.. నటిగా, దర్శకురాలిగా హిందీ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ స్ధానం ఏర్పాటు చేసుకుని నిలదొక్కుకున్నారు. అయితే తన తండ్రిలాగేనే కాస్త బోల్డ్ గా ఉండే కథాంశాలు ఎంచుకుంటూ ఆమె ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల నీలి చిత్రాల తార సన్నీ లియోన్‌ని నాయికగా పరిచయం చేసి సంచలనం సృష్టించింది పూజ. ఆమె దర్శకత్వం వహించిన చిత్రం 'జిస్మ్‌ 2'.

    'జిస్మ్‌ 2'కి కొనసాగింపుగా ఓ సినిమా తీస్తాను అని కూడా పూజా భట్ ప్రకటించారు. అయితే పూజ మనసు మార్చుకొన్నారు. 'క్యాబరే' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ప్రత్యేక గీతాలకు ఓ కొత్త నిర్వచనం చెప్పేలా 'క్యాబరే' సినిమా కథ నడుస్తుంది. ఈ చిత్రం తన కెరీర్ లో ప్రత్యేకమైనదని అప్పుడే పబ్లిసిటీ మొదలెట్టిందామె. సినిమా కాన్సెప్టు ఎలా ఉన్నా శృంగారాన్ని లోటు లేకుండా చూసుకుంటుంది అంటున్నారు బాలీవుడ్ జనం.

    ఈ చిత్రం గురించి పూజా భట్‌ మాట్లాడుతూ '' ఐటం సాంగ్ ఈ మధ్యన సినిమాల్లో అర్థాన్నే మార్చేశారు. నిజమైన ప్రత్యేక గీతాలు ఎలా ఉంటాయో ఇందులో ప్రస్తావిస్తాను. త్రీడీ పరిజ్ఞానంతో దీన్ని తెరకెక్కించబోతున్నాం. సంగీత ప్రధానంగా సాగుతుంది. ఇందులో రణ్‌దీప్‌ హుడా నేర సామ్రాజ్యం నుంచి వెలుగులోకి వచ్చిన వ్యక్తి పాత్రలో కనిపిస్తారు. ఇతనికి ఓ క్యాబరే డ్యాన్సర్‌కి మధ్య కథ ఎలా నడుస్తుందనేది కీలకం. వచ్చే ఏడాది సెట్స్‌ మీదకు వెళతాము''ని అన్నారు.

    గతంలో మధుర్‌ బండార్కర్‌ తీసిన 'చాందినీ బార్‌' కథను పోలి ఉంటుందా? అని ప్రశ్నిస్తే ''క్యాబరే సినిమాలో ప్రేక్షకులు వూహించిన దానికంటే ఎక్కువే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. 'చాందినీ బార్‌'తో ఎలాంటి పోలికా ఉండదు. వెండి తెరపై ఓ దృశ్యకావ్యాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. మా నాన్న మహేష్‌ భట్‌, రచయిత షగుప్త ఈ కథపై చర్చలు సాగిస్తున్నారు'' అని తెలిపింది.

    English summary
    Director Pooja Bhatt is back in action. Pooja who earlier directed Jism 2, which paved the way for Indo-Canadian porn star Sunny Leone in Bollywood, is all set to direct her next film, Cabaret. This would be her first film to get released in 3D, which will showcase the story of a cabaret dancer and her man, who is into crimes for a living.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X