Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పూజాభట్ 'క్యాబరే' తో సంచలనం
'జిస్మ్ 2'కి కొనసాగింపుగా ఓ సినిమా తీస్తాను అని కూడా పూజా భట్ ప్రకటించారు. అయితే పూజ మనసు మార్చుకొన్నారు. 'క్యాబరే' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ప్రత్యేక గీతాలకు ఓ కొత్త నిర్వచనం చెప్పేలా 'క్యాబరే' సినిమా కథ నడుస్తుంది. ఈ చిత్రం తన కెరీర్ లో ప్రత్యేకమైనదని అప్పుడే పబ్లిసిటీ మొదలెట్టిందామె. సినిమా కాన్సెప్టు ఎలా ఉన్నా శృంగారాన్ని లోటు లేకుండా చూసుకుంటుంది అంటున్నారు బాలీవుడ్ జనం.
ఈ చిత్రం గురించి పూజా భట్ మాట్లాడుతూ '' ఐటం సాంగ్ ఈ మధ్యన సినిమాల్లో అర్థాన్నే మార్చేశారు. నిజమైన ప్రత్యేక గీతాలు ఎలా ఉంటాయో ఇందులో ప్రస్తావిస్తాను. త్రీడీ పరిజ్ఞానంతో దీన్ని తెరకెక్కించబోతున్నాం. సంగీత ప్రధానంగా సాగుతుంది. ఇందులో రణ్‌దీప్ హుడా నేర సామ్రాజ్యం నుంచి వెలుగులోకి వచ్చిన వ్యక్తి పాత్రలో కనిపిస్తారు. ఇతనికి ఓ క్యాబరే డ్యాన్సర్‌కి మధ్య కథ ఎలా నడుస్తుందనేది కీలకం. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళతాము''ని అన్నారు.
గతంలో మధుర్ బండార్కర్ తీసిన 'చాందినీ బార్' కథను పోలి ఉంటుందా? అని ప్రశ్నిస్తే ''క్యాబరే సినిమాలో ప్రేక్షకులు వూహించిన దానికంటే ఎక్కువే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. 'చాందినీ బార్'తో ఎలాంటి పోలికా ఉండదు. వెండి తెరపై ఓ దృశ్యకావ్యాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. మా నాన్న మహేష్ భట్, రచయిత షగుప్త ఈ కథపై చర్చలు సాగిస్తున్నారు'' అని తెలిపింది.