»   » ఆ సూపర్ హిట్ బూతు చిత్రం త్రీడీలో

ఆ సూపర్ హిట్ బూతు చిత్రం త్రీడీలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎనభైల్లో వచ్చిన శృంగార చిత్రం 'కాలి గులా' సినిమా గురించి తెలియని వారు ఆ జనరేషన్ లో అరుదు. ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. అలాగే ఆ చిత్రాన్ని కొన్ని దేశాల్లో ప్రత్యేకమైన కట్స్ తో మాత్రమే అనుమతించారు. అయితే ఇప్పుడా చిత్రాన్ని ఈ తరానికి పరిచయం చేయటానికి ఆధునిక హంగులు సమకూర్చి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ చిత్ర దర్శకుడు టింటోబ్రాస్ భారీ ఎత్తున ఖర్చు పెట్టి త్రీడీలోకి మారుస్తున్నారు. అలాగే అప్పట్లో కట్ చేసిన దృశ్యాలను సైతం కలిపి దీన్ని రిలీజ్ చేయాలను అనుకుంటున్నారు. అప్పటి సెన్సార్ విధానానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవటంలో తప్పులేదంటున్నారాయన. ఇక ఈ చిత్ర కధ క్రీస్తు శకం 37-41లో జరుగుతుంది. ఇటలీని చక్రవర్తి గెయాస్‌ సీజర్‌ జర్మానికస్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది.ఆ చక్రవర్తికి కాలి గులా అనే పేరు కూడా ఉంది.దాంతో దానినే టైటిల్ గా పెట్టారు.ఇక వచ్చే మే నెలలో ఈ సినిమా నిర్మాణం ఇటలీలో మొదలు కానుంది. ఇక ఇలా అక్కడ శృంగార చిత్రం త్వరలో త్రీడి రూపంలోకి మారుతూంటే ఇక్కడ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ హర్రర్ చిత్రాన్ని త్రీడీలో డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu