twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కట్టప్ప ఎఫెక్ట్: బాహుబలి-2 రిలీజ్: ఆ రోజు బెంగళూరు బంద్ చేస్తాం!

    |

    బెంగళూరు: భారతదేశం మొత్తం బాహుబలి-2 సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తుంటో ఆ సినిమా విడుదలను తాము కచ్చితంగా అడ్డుకుంటామని, ఎట్టి పరిస్థితిలో సినిమా విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు తేల్చి చెబుతున్నాయి.

    కావేరీ జలవివాదం సందర్బంగా కన్నడిగులను అవమానించే విధంగా వ్యాఖ్యానాలు చేసిన సినీ నటుడు సత్యరాజ్ నటించిన ఏ సినిమాను కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకోవాలని కన్నడ సంఘాలు నిర్ణయించాయి.

    కట్టప్ప ఫేం అయితే మాకేంటి

    కట్టప్ప ఫేం అయితే మాకేంటి

    కావేరీ జలవివాదం సందర్బంగా కన్నడిగులను అవమానించే విధంగా వ్యాఖ్యానాలు చేసిన సినీ నటుడు సత్యరాజ్ నటించిన బాహుబలి-2 సినిమా విడుదల కావాలంటే వెంటనే సత్యరాజ్ కన్నడిగులకు క్షమాపణ చెప్పాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

    తమిళనాడులో సమస్య

    తమిళనాడులో సమస్య

    బాహుబలి-2 సినిమా కర్ణాటకలో విడుదల కావాలంటే సత్యరాజ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక వేళ సత్యరాజ్ కన్నడిగులకు క్షమాపణ చెబితే తమిళనాడులో ఆాయనకు కావేరి సెగ తగులుతోంది. బాహుబలి-2 (తమిళ్, తెలుగు, హిందీ) సినిమాను తమిళనాడులో అడ్డుకునే అవకాశం ఉందని సమాచారం.

    అదే రోజు బెంగళూరు బంద్

    అదే రోజు బెంగళూరు బంద్

    ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28 వ తేదీన బాహుబలి-2 సినిమా విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే అదే ఏప్రిల్ 28వ తేది బెంగళూరు బంద్ నిర్వహిస్తామని కన్నడ సంఘాల సమాఖ్య సంచాలకుడు వాటాళ్ నాగరాజ్ ప్రకటించారు.

    మాకు కావాల్సింది క్షమాపణ మాత్రమే

    మాకు కావాల్సింది క్షమాపణ మాత్రమే

    కట్టప్ప (సత్యరాజ్) కన్నడిగులకు క్షమాపణ చెప్పకపోతే బాహుబలి-2 సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని, అందులో ఎలాంటి సందేహం లేదని వాటాళ్ నాగరాజ్ స్పష్టం చేశారు. సత్యరాజ్ నటించిన సినిమా అయినందునే బాహుబలి-2 సినిమాను అడ్డుకుంటామని, మరే కారణం లేదని అంటున్నారు.

    టౌన్ హాల్ నంచి ఫ్రీడమ్ పార్క్ వరకు

    టౌన్ హాల్ నంచి ఫ్రీడమ్ పార్క్ వరకు

    ఏప్రిల్ 28వ తేదీన బెంగళూరు బంద్ నిర్వహించి టౌన్ హాల్ (పురభవన్ ) నుంచి ఫ్రీడం పార్క్ వరకు వేలాది మందితో భారీ ప్రదర్శన చేపడతామని వాటాళ్ నాగరాజ్ అన్నారు. బాహుబలి-2 సినిమా ప్రదర్శించి అన్ని చిత్రమందిరాల దగ్గర ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కన్నడ సంఘాల ప్రతినిధులు గోవిందు, ప్రవీణ్ కుమార్ శెట్టి, కెఆర్. కుమార్ తదితరులు ఏప్రిల్ 28వ తేది బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చారు.

    English summary
    Call for Bengaluru bandh on April 28: Sathyaraj's comments on Dr Rajkumar or Vatal Nagraj remain unacceptable. I want him to come here and apologise or at the least give a convincing clarification on his statement against us.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X