ప్లీజ్.. నన్ను బూడిదగా మార్చద్దు...ఐశ్వర్యారాయ్
రోబో ఘన విజయంతో ఉషారుగా ఉన్న ఐశ్వర్యారాయ్ తాజాగా మీడియోకు ఓ రిక్వస్ట్ చేసింది. అది తనను ఎవరూ . 'ఇకపై తనను 'యాష్" అంటూ రాయడం కానీ, పిలవడం కానీ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఐశ్వర్యరాయ్‌ను బాలీవుడ్ మీడియా మొదట్లో 'ఐష్" అనేది. అయితే.. ఈ 'ఐష్" అనే పదం పలకడానికి మరీ ఇబ్బందిగా ఉందని భావించిన బాలీవుడ్ మీడియా.. తర్వాత.. ఆమెను 'యాష్" అనటం మొదలుపెట్టింది. 'యాష్" అంటే ఇంగ్లీషులో 'బూడిద" అనే అర్ధం. దాంతో ఆ పదం తనకు చాలా ఇబ్బందిగా ఉంటోంది, తన భర్త అభిషేక్ ను తీసుకుని మీడియా ముందుకు వచ్చింది. అలాగే ..'నేను బాలీవుడ్‌కు వచ్చిన తొలినాళ్లలో నా పేరును రాయడానికి, పలకడానికి మీడియా కొంచెం ఇబ్బంది పడుతోందని నేనే భావించాను. అందుకే.. షార్ట్‌కట్‌లో 'యాష్" అనడం మొదలుపెట్టినా అభ్యంతరం చెప్పలేదు. కానీ.. ఇప్పుడు నా పేరు అందరికీ బాగా తెలుసు. కాబట్టి.. ఇకపెై నన్నలా పిలవొద్దని మనవి చేస్తున్నాను" అంది. కాబట్టి ఐశ్వర్యారాయ్ ని 'యాష్" అనొద్దు.


Click it and Unblock the Notifications











