రామ్ గోపాల్ వర్మకు పెద్ద బొక్క పెట్టిన దొంగలు
రామ్ గోపాల్ వర్మకు పెద్ద బొక్క పెట్టారు చోర శిఖామనులు. ప్రస్తుతం వర్మ బాలీవుడ్ లో డిపార్ట్ మెంట్ అనే చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగుకు వాడే రూ. 2 లక్షల విలువ చేసే 5D కెమెరాను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో రామ్ గోపాల్ వర్మ తెగ బాధ పడుతున్నాడు. కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాకు తొక్కలో 2 లక్షలు పోతే పోయేదేముంది అనే డౌట్ అందరికీ వచ్చింది. కానీ వర్మ బాధ 2 లక్షల గురించి కాదు....ఆ కెమెరాలో ఉన్న ఫిల్మ్ గురించి.
ఈ సినిమాలో నటిస్తున్న సంజయ్ దత్ పై చిత్రీకరించిన కీలక సన్నివేశాలు ఆ కెమెరాలోనే ఉండి పోయాయి. మళ్లీ ఆ సీన్లు చిత్రీకరించాలంటే రూ. 35 లక్షలు ఖర్చవుతాయట. ఆడబ్బు మళ్లీ పెట్టడానికి సిద్దంగా ఉన్నప్పటికీ....సంజయ్ దత్ డేట్లు అడ్జెస్ట్ చేసుకుని మళ్లీ ఆ సీన్లు చిత్రీకరించడం పెద్ద తలనొప్పిగా మారింది వర్మకు. దీంతో దొంగ పని చేసిన వారిని నానా బూతులు తిట్టుకుంటూ తెగ మదన పడుతున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. సినిమాకు పని చేసే వారే ఈ దొంగతనం చేశారని వర్మ అనుమానం వ్యక్తం చేస్తున్నాడని. సీక్రెట్ గా దర్యాప్తు జరిపిస్తున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











