‘గబ్బర్‌సింగ్’ను కచ్చితంగా క్రాస్ చేస్తుంది

By Srikanya

హైదరాబాద్ : ''పవన్‌కళ్యాణ్ నటించిన 'గబ్బర్‌సింగ్' ఇటీవల రికార్డులు సృష్టించింది. దాన్ని క్రాస్ చేస్తాడు మా 'కెమెరామన్ గంగతో రాంబాబు'. పవన్ నటన ఇందులో హైలైట్‌గా ఉంటుంది. ఇక తమన్నా ఓ అదనపు ఆకర్షణ. దర్శకుడు పూరి జగన్నాథ్ అద్భుతంగా తీశారు. ఆయనతో నేను దేశముదురు, శివమణి, నేనింతే తర్వాత చేస్తున్న నాలుగో చిత్రం ఇది. పవన్ అభిమానులు, తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు'' అన్నారు నిర్మాత డీవీవీ దానయ్య. సోమవారం దానయ్య మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

అలాగే... ''కెమెరామన్ గంగతో రాంబాబు చిత్రం రీ-రికార్డింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదల చేసిన ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 18న అత్యధిక ప్రింట్లతో సినిమా విడుదల చేస్తున్నాం'' అన్నారు . సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. పూరీ జగన్నాధ్,పవన్ కాంబినేషన్ లో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కావటంతో అంతటా షాకిచ్చే రేంజిలో బిజినెస్ జరుగుతోంది. ఇప్పటివరకూ ఏ హీరోకు లేనంతగా అమెరికా మినహా ఓవర్ సీస్ బిజెనెస్ కోటి రూపాయలు జరిగింది.

'పవన్‌కళ్యాణ్‌ ఓ పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. మంచి పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో పూరి జగన్నాధ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిమానులు అంతా మెచ్చేవిధంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌ హైలెైట్‌గా ఉండబోతున్నాయి అన్నారు. అలాగే పూరి జగన్నాధ్‌ ప్రత్యేకంగా పవన్‌ కోసం రాసిన డెైలాగ్స్‌కు థియేటర్లో చప్పట్లు మార్మోగుతాయి. ఏకధాటిగా సింగిల్‌ షెడ్యూల్‌లో ఇంతటి భారీ చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్రధాన కారణం పవన్‌కళ్యాణ్‌, పూరిల సహకారం. మా బ్యానర్‌లో పవన్‌కి బిగ్గెస్ట్‌ హిట్‌ రాబోతున్నందుకు సంతోషంగా ఉంది' అని నిర్మాత చెప్తున్నారు.

ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అనుకోని పరిస్ధితుల్లో పవన్ మీడియాలోకి రావటం హైలెట్ కానుంది.'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X