‘కెమెరామెన్ గంగతో...’ ఆడియో విడుదలైందోచ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమన్నా హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సాదీ సీదాగా నిర్వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో సీడీలను మార్కెట్‌లోకి విడుదల చేసారు. తొలి సీడీని దిల్ రాజు ఆవిష్కరించి దానయ్యకు అందజేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దానయ్య, సమర్పకుడు రాధాకృష్ణ, నైజా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామదాసు, ఆదిత్య దయానంద్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ పవన్ సినిమా అంటే ఆడియన్స్‌లో ఒక వేవ్ క్రియేట్ అవుతుంది. ఆయనకు హిట్, ప్లాపులతో సంబంధం ఉండదు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్ చిత్రాలను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసాను. కెమెరామెన్ గంగతో రాంబాబు నాలుగోది. ఈ చిత్రంలో మూడు పాటలు నాకు బాగా నచ్చాయి. మూడు సాంగులు హిట్టయ్యాయంటే సినిమా విజయం సాధించినట్లే అన్నారు.
నిర్మాత దానయ్య మాట్లాడుతూ..మణిశర్మ ఈచిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీగా మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమా అన్ని వర్గాల వారిని ఎంటర్‌టైన్ చేస్తుంది. అక్టోబర్ 18న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తనకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్‌లకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











