‘కెమెరామెన్ గంగతో..’ ఆడియో ట్రాక్ లిస్ట్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూర్య దేవర రాధాకృష్ణ సమర్పణలో యూనివర్శల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలోని సెవెన్ ఎకర్స్ లో నిర్మించిన భారీ సెట్స్‌లో జరుగుతోంది. తాజాగా ఈచిత్రం ఆడియో ట్రాక్ లిస్టు బయటకు వచ్చింది. ఎలాంటి ఆడియో వేడక లేకుండా నేరుగా సినిమా పాటలను మార్కెట్లోకి విడుదల కానున్నాయి.
ఆడియో ట్రాక్ లిస్ట్
1. థీమ్ సాంగ్
పాడినవారు: హేమ చంద్ర, కారుణ్య, నరేంద్ర
2. పిల్లని చూస్తే..
పాడినవారు: కారుణ్య, చిత్ర
3. జరమొచ్చింది
పాడినవారు: ఖుషి మురళి, శ్రావణ భార్గవి
4. ఎక్స్‌ట్రార్డరనీ
పాడినవారు: హేమ చంద్ర
5. మెలికల్
పాడినవారు: గీతా మాధురి, నరేంద్ర
6. తలదించుకు...
పాడినవారు: కారుణ్య, హేమచంద్ర, శ్రీకృష్ణ, నరేంద్ర
పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, నిర్మాణం: యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్య దేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











