పవన్ ‘కెమెరామెన్ గంగతో...’ డైలాగులు!
వవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూరి సినిమాలంటే డైలాగులు ఏం రేంజిలో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు.
తాజాగా ఫేస్‌బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలోనివి అంటూ కొన్ని డైలాగులు దర్శనం ఇస్తున్నాయి. పవర్ స్టార్ మేనరిజానికి తగిన విధంగా ఆ డైలాగులు ఉండటంతో అభిమానులను కట్టుకుంటున్నాయి.
ఆ డైలాగులు ఇవే...
1. విలన్ గట్టిగా అరుస్తుంటే....రాంబాబు(పవన్)ఇలా అంటాడు : చుప్‌బే సాలే, రాముడిని తలుచుకో పుణ్యం వస్తుంది....కానీ రాంబాబుని తలుచుకోకు నీ చావు కబురు బ్రేకింగ్ న్యూస్‌గా వస్తుంది.
2. పవన్ రౌడీతో : ఈ రాంబాబు తెలిసింది రెండే...ఒకటి న్యూస్ బ్రేక్ చేయడం, రెండు నీ బోన్స్ బ్రేక్ చేయడం
3. నేను క్యాజువల్‌గా కొట్టును కాబట్టి క్యాజువాలిటీలోనైనా ఉన్నారు...అదే కసిగా కొట్టి ఉంటే కాటికి పోయేవారు
4. రాంబాబు బ్యాండ్ వేయడం స్టార్ట్ చేస్తే...బాడీ మొత్తం బ్యాండేజీలతో నిండి పోతుంది
5. రాంగ్ టైంలో రాంబాబును కెలికావ్ రా...ఇకనీ బాబు వచ్చినా నీ చావుని ఆపలేరు
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. పూరీజగన్నాథ్ ఈ చిత్రం గురించి చెబుతూ.... పవన్ తాను కలిసి చేసిన 'బద్రి' తర్వాత మళ్లీ ఓ చిత్రం చేయాలని అనేకసార్లు ప్రయత్నించినా కుదరలేదని, తన 25వ చిత్రంగా మళ్లీ పవన్‌తో చేయడం ఆనందంగా వుందని తెలిపారు. ఓ న్యూస్ రిపోర్టర్ కథ ఇదని, మే రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, అక్టోబర్ 18న విడుదల చేయనున్న ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ అభిమానులు ఆశించే అన్ని అంశాలు వుండే డిఫరెంట్ యాక్షన్ చిత్రం ఇదని ఆయన వివరించారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యాం కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్


Click it and Unblock the Notifications











