‘కెమెరామెన్ గంగతో...’ ఫస్ట్ లుక్ పోస్టర్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టిన రోజును పురస్కరించుకుని బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పోస్టర్ డిజైన్ చేసారు. ఇప్పటికే ఇవి బయటకు వచ్చినా....పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు.
పవన్ హీరోగా, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం క్లైమాక్స్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ఠాగూర్ తరహా లో ఉంటుందని తెలుస్తోంది. ఠాగూర్ లో చిరంజీవి కి మద్దతు ఇవ్వటం కోసం జనం మొత్తం ఎక్కడెక్కడివాళ్లు వచ్చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వటానికి జనం వస్తారని, వారందరూ పవన్ మీడియా ద్వారా చేసే పనులకు ప్రేరితులై వస్తారని సమాచారం. అందుకే అభిమానుల సమక్షంలో ఈ సీన్ ని తీయాలని పూరి ప్లాన్ చేసారని అంటున్నారు.
3 పాటలు మినహా సినిమా షూటింగ్ ఈ నెలాకరుతో పూర్తవుతుంది. వచ్చే నెలలో మిగిలి ఉన్న మూడు పాటలు చిత్రీకరిస్తూనే...మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. చకచకా పనులు ముగుస్తుండటంతో అనుకున్న సమయం(అక్టోబర్ 18) కంటే వారం ముందుగానే అక్టోబర్ 11న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











