‘రాంబాబు’ గ్రాండ్ ఓపెనింగ్స్
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఈ రోజు రికార్డు స్థాయి థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ క్రేజ్ ఉండటంతో ఈచిత్రం తొలి రోజు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించనుంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం....సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ గబ్బర్ సింగ్ కంటే అత్యధిక థియేటర్లలో విడుదల కావడం, సినిమాపై మొదటి నుంచి హైప్ ఎక్కువగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ విషయంలో రికార్డు సృష్టిస్తుందని, గబ్బర్ సింగ్ ఓపెనింగ్స్ రికార్డును బద్దలు కొడుతుందని అంటున్నారు.
ఈ రోజు విడుదలైన ప్రతి చోట టికెట్ల కోసం జనాలు ఎగబడ్డారు. థియేటర్ల పరిమితి కంటే రెండు మూడు రెట్ల సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో కొన్ని చోట్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రౌడ్ కంట్రోల్ చేయడం కొన్ని చోట్ల థియేటర్ సిబ్బంది వల్ల కాక పోలీసుల సహాయం తీసుకున్నారు.
చాలా చోట్ల టికెట్లన్నీ అడ్వాన్స్‌గా బుక్ అయి పోయాయి. కొన్ని చోట్ల వీకెండ్ వరుకు అడ్వాన్స్ బుకింగ్ అవ్వడంతో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేసారు. మరి రాంబాబు తొలి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసాడనేది రేపు ఉదయానికల్లా తేల నుంది. మరి సినిమా యావరేజట్ టాక్ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











