‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ కృష్ణా రైట్స్ కేక!
విజయవాడ: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈచిత్రం కృష్ణా జిల్లా రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ గ్రూపు ఈచిత్రం కృష్ణా జిల్లా రైట్స్ రూ. 2.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ గ్రూపు ఈచిత్రాన్ని కృష్ణా జిల్లాలో భారీ ఎత్తున రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో అకీరా తండ్రితో కలిసి ఓ సాంగులో స్టెప్పులు వేసాడని సమాచారం.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











