ప్రిన్సెస్ కేఫ్ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఫైట్
పవన్‌కల్యాణ్ హీరగా,పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలోని ప్రిన్సెస్ కేఫ్ ప్రాంతంలో చేశారు. ఫైట్ మాస్టర్ విజయ్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఆ ఫైట్ సినిమాలో కీలకంగా నిలుస్తుందని,కథను మలుపు తిప్పేదని అని చెప్పుతున్నారు. ఆర్.ఎఫ్ సి లో ఐదు రోజులు చిన్న షెడ్యూల్ ఉంది. అక్కడ పూర్తి కాగానే మళ్లీ పద్మాలయాలో సెట్ కు వచ్చేస్తారు. ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత.
నిర్మాత మాట్లాడుతూ...''పవన్ కల్యాణ్ పాత్ర చిత్రణ, ఆయన నటన మాస్‌ను ఆకట్టుకొనేలా ఉంటాయి. పూరి శైలి సంభాషణలు అందర్నీ అలరిస్తాయి. పవన్ అభిమానుల సమక్షంలో ఓ పాట చిత్రీకరణకు సన్నాహాలు సాగుతున్నాయి''అన్నారు. ఇక ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నిలిస్టు గా కనిపించనున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని తెలిసింది. పవన్ ఈ చిత్రంలో మెకానిక్ గా కనిపించి అలరించనున్నారు.
తెలిసిన సమాచారం ప్రకారం హీరోయిన్ తమన్నా ..గంగగా మీడియాకు చెందిన వ్యక్తిగా కనిపిస్తుంది. ఆమె మెకానిక్ గా ఉండే పవన్ తో కలిసి సమాజానికి పనికివచ్చే రిపేర్స్ చేయిస్తుంది. మెకానిక్ గా ఉండే అతను కెమెరా తో సమాజంలోని కొన్ని దారుణాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి అవకతవకలను సరిచేస్తాడని చెప్పుకుంటున్నారు. ఈ పాత్ర పవన్ కెరీల్ లో ఓ కొత్త యాంగిల్ లో మాస్ కి పట్టేలా ఉంటుందని సమాచారం.
అలాగే ఆ మధ్యన సారిధీ స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన ఐటం సాంగ్ ని హైదరాబాద్‌లో తెరకెక్కించారు. శ్రీకాకుళం యాసలో హుషారుగా సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్ రాశారు. లండన్‌కి చెందిన స్కార్లెట్ హిందీలో 'షాంఘై' అనే చిత్రంలో ఐటెమ్ గీతం చేసింది. ఇటీవలే రామ్‌చరణ్ చిత్రం 'ఎవడు'లోనూ నర్తించింది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు.
నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ముందే పూరీ ప్రకటించారు. 'కెమెరామేన్ గంగతో రాంబాబు'రిలీజ్ కు ముందే దాదాపు యాభై కోట్ల వరకూ బిజినెస్ జరగనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు, పాటలు: భాస్కరభట్ల, సంగీతం: మణిశర్మ.


Click it and Unblock the Notifications











