పవన్‌తో ఫ్యాన్స్ షూటింగ్ ఆర్.ఎఫ్.సి
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాల స్థలంలో జరుగుతోంది. తాజాగా ఇక్కడ షూటింగ్ పూర్తయింది.
ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ ఆగస్టు 6 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగనుంది. ఇక్కడ పాటల చిత్రీకరణతో పాటు క్లైమాక్స్ సీన్లు, అభిమానులతో కలిసి పవర్ స్టార్ నటించే సీన్లు చిత్రీకరించనున్నారు. ఈ నెల చివరి వరకు ఇక్కడే షూటింగ్ జరుగనుంది. పవర్ స్టార్ వెనక అభిమానులు నడిచే సీన్లు జూలైలోనే చిత్రీకరించాల్సి ఉండగా అప్పుడు వాతావరణ అనుకూలించక పోవడంతో షూటింగ్ వాయిదా వేశారు. దాన్ని తాజాగా ఈ షెడ్యూల్‌లో ప్లాన్ చేశారు.
అయితే అభిమానులతో షూటింగ్ ఏ రోజు ఉంటుందనే విషయం త్వరలో దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రకటించనున్నారు. చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆగస్టు 22న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుంది. పవన్ ఇందులో మెకానిక్‌గా నటిస్తుండగా, తమన్నా జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది.
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం తర్వాత పవర్ స్టార్ శ్రీ వరసిద్ది వినాయక్ ప్రొడక్షన్స్ పతాకంపై కొండా కృష్ణం రాజు నిర్మించబోయే చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన తొలిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications











