పవన్ ‘రాంబాబు’కు పేరడీ..

By Bojja Kumar

హైదరాబాద్: ఈ మధ్య ఏ స్టార్ హీరో సినిమా విడుదలైనా ఆ సినిమాల్లో హీరో క్యారెక్టర్ ను ఇమిటేట్ చేస్తూ పేరడీ వీడియోలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య మహేష్ బాబు 'బిజినెస్ మేన్' చిత్రంపై వచ్చిన 'సూర్య భాయ్ టాయ్ లెట్స్' పేరడీ తెలుగు ప్రేక్షకులను తెగ నవ్వించింది.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై కూడా ఓ పేరడీ రూపొందింది. 'కాకినాడ రాంబాబు' అనే పేరుతో రూపొందిన ఈ పేరడీ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రాజకీయాలు నేపథ్యంలో సాగితే.... ఈ పేరడీ వీడియో అబ్బాయిలు, అమ్మాయిల ప్రేమ వ్యవహారల చుట్టూ తిరుగుతోంది. ఇంటర్నెట్ లో ఈ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

ఇక పవన్ తర్వాతి సినిమాల విషయానికొస్తే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రచ్చ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈచిత్రాన్ని ప్రస్తుత రాజకీయాలు, అవినీతిని ఫోకస్ చేస్తూ రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్ టైన్మెంట్ అంశాలను కలగలిపి వినోదాత్మకంగా తెరకెక్కించనున్నారు.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమా వివరాల్లోకి వెళితే... ఈ చిత్రంలో పవన్ సరసన సమంత దాదాపుగా ఖరారైంది. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X