రికార్డ్ స్థాయి రిలీజ్..(రాంబాబు అఫీషియల్ ప్రెస్ నోట్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూర్య దేవర రాధాకృష్ణ సమర్పణలో యూనివర్సల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' అక్టోబర్ 18న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ...మా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని అక్టోబర్ 18న వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకెల్లా అత్యధిక ఫ్రింట్లతో, అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. డబ్బింగ్, రీ-రికార్డింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డిటిఎస్ మిక్సింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన 'గబ్బర్ సింగ్' మించే స్థాయిలో ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది.
ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలై థియేటర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అయి మా బేనర్‌కి మంచి పేరు తెస్తుంది. ఆల్రెడీ ఈ చిత్రంలోని పాటలు చాలా పెద్ద రేంజిలో హిట్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో అభిమానులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి' అన్నారు.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











