‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ రిలీడ్ డేట్ చేంజ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు'చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 18న విడుదల చేస్తామని దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అంతకంటే ముందుగానే అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అనుకున్న దానికంటే షూటింగ్ పూర్తవుతుండటంతో ఈ మార్పులకు కారణమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ రామోజీఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ జరిగే షూటింగుతో టాకీ పార్టు పూర్తవడంతో పాటు మేజర్ ఫైట్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. పోస్టు ప్రొడక్షన్ పనులు, మిగిలి ఉన్న పాటల చిత్రీకరణ సెప్టెంబర్ నెలలో పూర్తికానున్నాయి.
అక్టోబర్ 3వ తేదీ నాటికి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యే అవకాశాలు ఉండటంతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ మేరకు అనకున్నదానికంటే వారం రోజుల ముందే అంటే అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక సమచారం వెలువడనుంది.
ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ అన్నయ్య చిరంజీవి బర్త్ డేని పురస్కరించుకుని ఆగస్టు 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా ఆడియో సెప్టెంబర్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈచిత్రాన్ని డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











