‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సెట్ ఇదే...
'గబ్బర్ సింగ్' సెన్షేషన్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ సరసన తమన్నా హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సారథి స్టూడియోలో జరుగుతోంది. ఇక్కడ ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. ఆ సెట్ ఫోటోను మీరు ఫోటోలో చూడొచ్చు.
ఈచిత్రం పవర్ ఫుల్ సబ్జెక్టు, అంతకంటే పవర్ ఫుల్ డైలాగ్స్ కలగలిపి అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ సినిమాగా రూపొందబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా కనిపించనున్నాడు. ప్రతి రంగంలోనూ మంచి వారు, చెడ్డ వారు ఉన్నట్లే మీడియా రంగంలోనూ అక్రమార్కులు, చీడ పురుగులు ఉన్నారు. ఈ చిత్రంలో మీడియాలోని చీడ పరుగులపై సెటైర్లు ఉంటాయని, విలువలు దిగజార్చి మీడియాను డబ్బు సంపాదించడానికి, అక్రమార్జనకు వాడుకుంటున్న వారిని ఎండగట్టే విధంగా డైలాగులు ఉంటాయని అంటున్నారు.
సినిమా షూటింగుల విషయంలో పక్కా ప్లాన్ ఫాలో అయ్యే దర్శకుడు పూరి జగన్నాథ్...ఈచిత్రాన్ని పర్ ఫెక్ట్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసి అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ కాగా, బ్రెజిల్ భామ గాబ్రియేలా బెర్టాంటె ఐటం సాంగులో హాట్ హాట్‌గా అందాలు ఆరబోయనుంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్


Click it and Unblock the Notifications











