పూరి దెబ్బకు ‘రాంబాబు’ ప్యాకప్, తమన్నా ఖాళీ!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయింది. ఇప్పటికే ఈ చిత్రం టాకీ పార్టు పూర్తి కాగా తాజాగా బ్యాలెన్స్ సాంగ్స్ కూడా అన్నా పూర్ణ స్టూడియోలో పూర్తి చేసారు. ఈ పాట చిత్రకరణ పవన్ కళ్యాణ్, గాబ్రియేలా బెర్టాంటెలపై షూట్ చేసారు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక పోస్టు ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
కాగా పూరి స్పీడుకు సినిమా తొందరగా పూర్తవం సంగతి అటుంచితే...తమన్నా డేట్స్ అనవసరంగా ఎక్కువ తీసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా కోసం 60 రోజుల కాల్షీట్లు ఇచ్చిన తమన్నా కోటి రూపాయల పారితోషికాన్ని అందుకుంది. అయితే స్పీడ్‌గా షూటింగ్‌లు పూర్తిచేసే పూరీ కేవలం 40 రోజుల్లోనే తమన్నా పాత్రను పూర్తి చేశాడు. దీంతో ఆమె మూడు వారాల డేట్స్ ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఎక్స్‌ట్రా డేట్స్ అడిగితే పారితోషికాన్ని పెంచి డిమాండ్ చేసే హీరోయిన్‌లు డేట్స్ వాడుకోకపోతే రెమ్యూనరేషన్‌ను తిరిగిచ్చే అగ్రిమెంట్ లేకపోవడంతో నిర్మాతకు ఏమీ చెయ్యలేని పరిస్థితి, మిగిలి ఉన్న ఆమె డేట్స్ వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ వారంలోనే ఆడియో రిలీజ్ చేసి వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రం కోసం అద్భుతమైన ఆడియో ఇచ్చారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ జరుగుతోంది. మా బ్యానర్లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది' నిర్మాత అన్నారు.
పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, నిర్మాణం: యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్య దేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











