‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మూవీ నిలిపివేత
ప్రకాశం: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని ప్రకాశం జిల్లా చీరాలలోని మోహన్ థియేటర్లో ప్రదర్శన నిలిపి వేసారు. రెవెన్యూ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా...సినిమా టిక్కెట్లు అధిక ధరకు అమ్ముకున్నారనే కారణంతో అధికారులు ఈ చిత్రాన్ని ఇక్కడ నిలిపి వేసినట్లు తెలుస్తోంది. థియేటర్‌ను సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక సినిమా వివరాల్లోకి వెళితే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా రూపొందిన ఈచిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య ఈచిత్రాన్ని నిర్మించారు. విషయానికొస్తే......సినిమా జస్ట్ యావరేజ్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం ఎంటర్ టైన్మెంట్ విషయంలో 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని బీట్ చేస్తుందని ఊహించిన వారి అంచనాలు తలక్రిందులు అయ్యాయి.
ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం....సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ గబ్బర్ సింగ్ కంటే అత్యధిక థియేటర్లలో విడుదల కావడం, సినిమాపై మొదటి నుంచి హైప్ ఎక్కువగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ విషయంలో రికార్డు సృష్టిస్తుందని, గబ్బర్ సింగ్ ఓపెనింగ్స్ రికార్డును బద్దలు కొడుతుందని అంటున్నారు.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











